పిడుగుపాటుకు  దూడ మృతి

పిడుగుపాటుకు  దూడ మృతి

సిద్దిపేట : ముద్ర ప్రతినిధి సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో సోమవారం తెల్లవారుజామున పిడుగు పడి దూడ చనిపోయింది. గ్రామానికి చెందిన గడబోయిన మల్లయ్య అనే రైతు తన పాడి ఆవులను, గేదెలను గ్రామ శివారులో కొట్టంలో కట్టివేశారు. దూడలను మాత్రం ఖాళీగా విడిచిపెట్టారు. ఉదయము పాలు పితకడానికి వెళ్ళినప్పుడు దూడ కనిపించకపోవడంతో సమీపంలో వెతకగా చనిపోయి కనిపించింది. తెల్లవారుజామున పిడుగు పడటంతో పాలు తాగే దూడ మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రభుత్వం తన ఆదుకోవాలని కోరారు.