ఉచిత వైద్యం అందిస్తున్న చావా ఫౌండేషన్ సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి 

ఉచిత వైద్యం అందిస్తున్న చావా ఫౌండేషన్ సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి 

వలిగొండ (ముద్ర న్యూస్ ): వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం గ్రామంలో చావా ఫౌండేషన్, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో భువనగిరి ఆర్ కె ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన పల్లె పల్లెకు వైద్యం అనే ఉద్దేశ్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ

పేద ప్రజలకు గ్రామాలలో ఉచిత వైద్యం అందించి వారికి సేవలందించడం అభినందనీయమన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పెద్ద ఆస్పత్రికి వెళ్లలేక అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు తమ ముంగిటికి డాక్టర్లు రావడం గొప్ప విషయమని తెలిపారు. కార్పొరేట్ వైద్యశాలలు కూడా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఇలాంటి క్యాంపుల ద్వారా సేవలందిస్తే సమాజానికి ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే వివరించారు.

అనంతరం దాసిరెడ్డి గూడెం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవనాన్ని పనులను పరిశీలించారు.