ఉద్యోగాల కల్పనలో బి అర్ ఎస్, బిజెపిలు విఫలం

ఉద్యోగాల కల్పనలో బి అర్ ఎస్, బిజెపిలు విఫలం
  • ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తున్నాయి
  • ఈటల 20 ఏళ్లలో హుజురాబాద్ కు చేసింది ఏం లేదు
  • గజ్వేల్ కు వెళ్లి అక్కడ బిడ్డను, హుజూరాబాద్ వచ్చి ఇక్కడ బిడ్డను అంటున్నాడు
  • బి అర్ ఎస్, బిజెపిలవి మోసపూరితమైన మాటలు
  • కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ 


ముద్ర,జమ్మికుంట:-రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ అన్నారు. బుధవారం జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లోని గండ్రపల్లి, నాగంపేట్, రాచపల్లి, మల్లన్న పల్లి, శాయంపేట్, బికిగిరిషరీఫ్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం ఉద్యోగులకు జీతం సరైన టైం కి ఇవ్వడం చేతగాని ప్రభుత్వం మనది ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా అని హుజురాబాద్ నియోజకవర్గం నుంచి 20 సంవత్సరం నుండి గెలుస్తూ ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు మంత్రిగా ఈటల రాజేందర్ కొనసాగినప్పటికీ హుజురాబాద్ కు చేసిందేమీ లేదని ఆయన దుయ్యబట్టారు. ఈటల రాజేందర్ హుజురాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని గజ్వేల్ కి వెళ్లి అక్కడ బిడ్డనని, హుజురాబాద్ కు వచ్చి ఇక్కడ బిడ్డనని అంటున్నారని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీలను గడపగడపకు అందజేసే నిర్విరామంగా పనిచేస్తానని తెలిపారు.  తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు.

హుజురాబాద్ నియోజకవర్గం లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని అన్నారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. మహిళల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ మహిళలకు ప్రతినెల 2500 రూపాయలను, వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలిపారు. నిరుద్యోగ యువత కోసం నియోజకవర్గంలో డిజిటల్ లైబ్రరీలు, స్టడీ సెంటర్లు ఏర్పాటుచేసి పోటీ పరీక్షలకు సమాయత్తం అయ్యేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం దుకాణాలు పెంచి యువతను మత్తుకు బానిస చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగులను మభ్య పెట్టేందుకు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం మళ్ళీ వాటిని రద్దు చేయడం, కేసులతో క్యాన్సిల్ చేయడం తప్ప ఉద్యోగాలను భర్తీ చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. తెలంగాణ యువత అధైర్య పడవద్దని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు. యువకుల ఉన్నత విద్య కోసం యువ వికాసం పథకం ద్వారా ఐదు లక్షల రూపాయల ఆర్థికసాయాన్ని అందజేసి వారి విద్యాభ్యున్నతి కి పాటుపడతామని చెప్పారు. అనంతరం బిజిగిరి షరీఫ్ దర్గాలో ప్రార్థనలో పాల్గొన్నారు.