కాంగ్రెస్ దే విజయం.. సర్వేలన్నీ ఇదే చెప్తున్నాయి..

కాంగ్రెస్ దే విజయం.. సర్వేలన్నీ ఇదే చెప్తున్నాయి..

భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ముద్ర ప్రతినిధి భువనగిరి : రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో  కాంగ్రెస్ దే విజయమని సర్వేలన్నీ ఇదే చెప్తున్నాయని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం  భువనగిరిలో విలేకరులతో మాట్లాడుతూ భువనగిరి అంటే పోరాటాలకు మారుపేరు అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఫ్యాన్సు, బాత్రూమ్స్ లేకపోతే 20 లక్షలు పెట్టి బాగు చేయించా అని చెప్పారు. మైనార్టీల కోసం 20 లక్షలు పెట్టి దర్గా కట్టించిన్నట్లు తెలిపారు.

 పేద విద్యార్థులు నా దగ్గరకు వస్తే పార్టీలకు అతీతంగానే సాయం చేస్తున్నానని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందన్నారు. ఏ సర్వే చూసినా కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతోందన్నారు. వడగళ్ల వానకు పంట నష్టం జరిగితే ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు.  గ్రూప్-2 పరీక్ష పోస్ట్ పోన్ చేయమంటే చేయడం లేదన్నారు. మా ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలను పారదర్శకంగా ఇస్తామన్నారు. 5 లక్షల మంది టీఆర్టీ కోసం ఎదురుచూస్తున్నారని మా ప్రభుత్వం వచ్చిన 2, 3 నెలల్లోనే నోటిఫికేషన్ ఇస్తామన్నారు. భువనగిరి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ ని గెలిపిస్తానన్నారు. 24 గంటల కరెంట్ పై ప్రభుత్వం చెప్పేవి అబద్ధాలని లాగ్ బుక్స్ తో అన్నీ బయటపెట్టా అన్నారు.
మరోసారి సబ్ స్టేషన్ దగ్గర ధర్నాకు దిగుతా.. దెబ్బకు కేసీఆర్ దిగి రావాలి అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ ఇస్తామని, మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ పైనే చేస్తాం అని చెప్పారు. విచ్చలవిడిగా భూములు అమ్మేస్తున్నారని 50వేల కోట్లు తాగుడు మీదే వస్తున్నాయని ఆ పైసలన్నీ ఎటుపోతున్నాయని ప్రశ్నించారు. ఈనెల 16, 17 తర్వాత బస్సుయాత్ర మొదలుపెట్టి తెలంగాణ అంతా కాంగ్రెస్ నేతలం పర్యటిస్తామన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, పచ్చిమట్ల శివరాజ్ గౌడ్, పంజాల రామాంజనేయులు గౌడ్ లు ఉన్నారు.