మలేషియాలో పొలస వ్యక్తి మృతి

మలేషియాలో పొలస వ్యక్తి మృతి

మృతదేహం తెప్పించాలని కుటుంబ సభ్యుల వేడుకోలు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలం పోలాస గ్రామానికి చెందిన బస్వరాజు సంతోష్ ఉపాధి నిమిత్తం మలేషియాకు ఎడాది క్రితం వెళ్ళాడు. ఈ నెల 6న మలేషియాలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించాడు. అయితే అక్కడ కంపెనీ యాజమాన్యం మృతదేహాన్ని ఇంటికి పంపడానికి నిరాకరించడంతో మృతుడి తల్లి బస్వరాజు లక్ష్మి స్థానిక సర్పంచ్ గాజాంగి నందయ్య సహకారంతో టిపిసిసి ఎన్ ఆర్ ఐ కన్వీనర్ డా. షేక్ చాంద్ పాషాను ఆశ్రయించారు.

వెంటనే స్పందించిన పాషా మలేషియా ఎంబ్బసి కి కంప్లైంట్ చేసి అక్కడ కంపెనీ కి డాక్యుమెంట్స్ పంపి లిఖిత పూర్వకంగా లేఖ రాయగా, అక్కడ కంపెనీ మృతదేహాన్ని పంపడానికి అంగీకరించింది. TG329 తాయి ఎయిర్లైన్స్ విమానం లో మలేషియా నుండి హైదరాబాద్ శంసాబాద్ ఎయిర్ పోర్ట్ కు 13న మృతదేహం వస్తుందని తెలిపారు. మృతదేహంని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి స్వగ్రామo పోలాసకు తీసుకురావడానికి ఉచిత అంబులెన్స్ కొరకు పాషా ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాయగా అంబులెన్స్ ఏర్పాటు చేసి ఫోన్ లో సమాచారం అందిచినట్లు తెలిపారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం రూ. 5 లక్షల ఎన్ ఆర్ ఐ ఆర్థిక సహాయం అందించాలని చాంద్ పాషా డిమాండ్ చేశారు. మృతదేహాన్ని ఇంటికి తెప్పించేందుకు సహకరించిన గ్రామ సర్పంచ్ నందయ్యా, షేక్ చాంద్ పాషా లను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు .