రాజన్న ఆలయంలో భక్తుడి మృతి

రాజన్న ఆలయంలో భక్తుడి మృతి
Devotee dies in Rajanna temple

వేములవాడ: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో విషాదం నెలకొంది. ఆలయ ఈవో కార్యాలయం ముందు ఫిట్స్‌ తో ఒక భక్తుడు  మృతి చెందాడు. రాజన్న దర్శనం కోసం వచ్చిన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తి తో పాటు కుటుంబ సభ్యులు వచ్చారు. ఈవో కార్యాలయం ముందు కుర్చున్న సాయిలుకు  ఫిట్స్‌ వచ్చి మృతి చెందాడు. ఆలయ అధికారులు  పట్టించుకోలేదని మృతుడి కుటుంబసభ్‌ఉలు ఆరోపించారు.  ఆలయం వద్ద ఉన్న ప్రధమ చికిత్స కార్యాలయానికి అధికారులు  తాళం వేసినట్లు సమాచారం.