ప్రతి మహిళా నైపుణ్యాభివృద్ధి సాధించి  లక్ష్యాన్నిఅందుకోవాలి -  జిల్లా కలెక్టర్ యాష్మీన్ భాషా

ప్రతి మహిళా నైపుణ్యాభివృద్ధి  సాధించి  లక్ష్యాన్నిఅందుకోవాలి -  జిల్లా కలెక్టర్ యాష్మీన్ భాషా

ముద్ర ప్రతినిధి, జగిత్యాల :మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండి ముందుకు సాగాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాష్మీన్ భాషా సూచించారు. ప్రతి మహిళా వారికి నచ్చిన రంగంలో నైపుణ్యం పొందినప్పుడే ఆర్థికంగా ఎదుగవచ్చని కలెక్టర్ అన్నారు.మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇప్పించేందుకు గాను జగిత్యాలలో టీ-లైఫ్ సంస్థ రాష్ట్ర ఆర్గనైజర్ తాటిపర్తి దీపికా రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన సంస్థ కార్యాలయాన్ని జిల్లా జడ్జి నిలిమా, జగిత్యాలడిఎస్పీ రఘుచందర్ లతో కలిసి కలెక్టర్ ప్రారబించారు.

ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ సెల్ ఫోన్లలో మనం ప్రపంచాన్ని  మనచేతుల్లోనే ఉన్న దాన్ని మంచికి ఉపయోగించడం లేదన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటికి మన నడవదికలో మార్పు రాకపోవడం భాధకారమన్నారు.నాణ్యమైన వస్తువులకు మార్కెట్లో ధర ఎప్పుడు ఉంటుందని వాటిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.ప్రతి మహిళలో స్కిల్స్ ఉంటాయని వాటిని  డెవలప్ చేసుకోవాలని సూచించారు.

సోషల్ మీడియాలో డబ్బులు రెట్టింపు అని వచ్చే వదంతులను నమ్మవద్దని, ఎవరికి వారే తమకున్న పరిజ్ఞానంతో స్కిల్స్ డెవలప్ చేసుకోవాలన్నారు కలెక్టర్ సూచించారు. డబ్బులు రెట్టింపు చేస్తామని చెప్పే వారిపట్ల జాగ్రత్తగా ఉంటూ ఎవరిని గుడ్డిగా నమ్మవద్దని సూచించారు.కోవిడ్ వల్ల మంచి, చెడులు సమాజానికి తెలిశాయన్నారు. మెప్మా ద్వారా రుణాలు ఇస్తున్నామని వాటిని మహిళలు ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదగలన్నారు.

మహిళలు వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే  పట్టుదల ,కృషి అవసరమన్నారు. ఆకాశంలో మహిళలు సగం అన్నారు. మహిళలు ఆర్థికంగా బాగుంటే కుటుంబం, సమాజం బాగుంటుందన్నారు. బ్యాంకులు సైతం మహిళల ఉపాధికోసం ఋణాళిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి మహిళ ఇతరులకు సహాయపడే విధంగా ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం ఆర్థికంగా బాగుపడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. గతంలో ఉమ్మడి కుటుంబాలుండేవని,ఇంటి పెద్ద సలహా, సూచనలతోనే ఇంటిల్లిపాది నడుచుకునేవారని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ము0దుకు వచ్చి లీడర్ షిప్ అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్ మహిళలకు సూచించారు..మహిళలను ఎంటర్ టైనర్ గాతయారు చేయాలనే లక్ష్యంతో టీ లైఫ్ సంస్థ ముందుకు నడుస్తుందని సంస్థ నిర్వహకులైన దీపికా రెడ్డి, శిరీషా రెడ్డి లను కలెక్టర్ అభినందించారు.

జిల్లా జడ్జి నిలిమా మాట్లాడుతూ సమాజంలోని చెడును మేము చూస్తే జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు అభివృద్ధిని చూస్తారని పేర్కొన్నారు. మహిళల రక్షణకోసం చట్టాలు చేసిన సమాజంలో మహిళలకు అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.చిన్న తనంలో భర్త చనిపోయిన భార్య పిల్లలను సన్మార్గంలో పెడుతూ ఉన్నత లక్ష్యాలకోస0 పాటుపడుతుందని పేర్కొన్నారు.ప్రతి మహిళా ఒక్క క్షణం ఆలోచిస్తే వరకట్న హత్యలుండవని అన్నారు. కుటుంబం కోసం నిరంతరం పాటుపడేది భార్య అయితే కుటుంబాన్ని సమాజంలో ఉన్నతంగా ఉంచడానికి భర్త కడ్తపడుతారని నీలిమ అన్నారు. కుటుంబం బాగుపడాలంటే మహిళల బాధ్యత ముఖ్యమని చెబుతూ మహిళా లోకానికి సాయపడలనేదే టి లైఫ్ ఉద్దేశమని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే ముందుగా ఆర్థికంగా బాగుపడాలన్నారు.

మహిళల్లో క్రైo రేట్ తగ్గించడానికి టి లైఫ్ సంస్థ ఉపయోగపడాలని జిల్లా జడ్జి నిలిమా అఖాంక్షించారు.టి లైఫ్ రాష్ట్ర ఆర్గనైజర్ దిపికారెడ్డి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతూ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుని నిలబడినపుడే దేశం బాగుపడుతుందన్నారు.టి-లైఫ్ సంస్థ ఏర్పాటు, సంస్థ లక్ష్యాల గురించి ఆమే వివరించారు. డిఎస్పీ రఘు చందర్ మాట్లాడుతూ మహిళల భద్రత పట్ల పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు భరోసా కేంద్రాలను సంప్రదించాలన్నారు.

కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట్ రెడ్డి, మెప్మా అధికారి దుర్గపు శ్రీనివాస్ గౌడ్,డి ఆర్ డి ఓ,టిలైఫ్ జిల్లా ఆర్గనైజర్ పొన్నాల శిరీషా రెడ్డి, బొడ్డు వనిత, లావణ్య,సమత, లావణ్య, మానస, మహిళా కాంగ్రెసు రాష్ట్ర కార్యదర్శి, మాజీ సర్పంచ్ తాటిపర్తి శోభారాణి,తదితరులు పాల్గొన్నారు.