కోరుట్ల పట్టణంలో పేదల గుడిసెలపై  రాష్ట్ర ప్రభుత్వ దౌర్జన్యం నశించాలి...

కోరుట్ల పట్టణంలో పేదల గుడిసెలపై  రాష్ట్ర ప్రభుత్వ దౌర్జన్యం నశించాలి...
  • కూల్చిన గుడిసెలకు నష్ట పరిహారం చెల్లించాలి...
  • ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు...
  • అర్హులైన వారికి ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి...
  • CPM కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ , చేరుపల్లి సీతారాములు... 

ముద్ర. కోరుట్ల: కోరుట్ల పట్టణం జంబి గద్దే ప్రాంతములో పేదలు గత 6 నెలల క్రితం నిర్మించుకున్న అక్రమ నిర్మాణాలను శుక్రవారం ఊదయం రేవెన్యూ అధికారులు పోలీసుల సహాకారంతో అక్కడికి చేరుకొని అందులో నివసిస్తున్న వారిని బయటకి పంపించారు. అనంతరo జెసిబి సహాయంతో వాటిని కుల్చేసారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతు ప్రభుత్వo ఇండ్ల స్థలాలను నిబందనల మేరకు కేటాయిస్తుందని, ప్రభుత్వం సూచించిన సమయంలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని, ఇష్టరాజ్యంగా నిర్మాణాలు చేపట్టకూడదని అన్నారు. 

గుడిసెలను కూల్చివేయడాన్ని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి  సీతారాములు తీవ్రంగా ఖండించారు. మధ్యాహ్నం సిపిఎం రాష్ట్ర బృందం కోరుట్ల పట్టణంలో కూల్చివేసిన గుడిసెల స్థలాన్ని రాష్ట్ర బృందం సందర్శించింది.

ఈ సందర్భంగా సీతారాములు మాట్లాడుతూ సర్వే నెంబర్ 923 లో గల 53 ఎకరాల భూమి లో 400 గుడిసెలు, దాదాపు లక్ష రూపాయలు ఖర్చు చేసి, 80 వరకు పక్క ఇళ్ళు నిర్మించుకుని ఆరు మాసాలుగా పేదలు కార్మికులు నివాసం ఉంటూ పట్టాలివ్వలాని పోరాడుతున్నారు. వేకువజామున సుమారు 4 గంటల ప్రాంతంలో వందలాది మంది పోలీసులు వచ్చి, జెసిబి తో గుడిసెలను కూల్చేయడం, విలువైన వస్తువులు, గ్యాస్ సిలిండర్లు, కుట్టు మిషన్లు, వాహనాలు, వంట సామాగ్రి తీసుకెళ్ళి, పేద ప్రజలందరిని భయభ్రాంతులకు గురిచేసి, దాడులు చేసి ముఖ్య నాయకులను అరెస్టు చేసి, వివిధ పోలీస్ స్టేషన్లకు  తరలించారు. గత పాలకులకు  ఈ పాలకులకు తేడా ఏమి లేదన్నారు. 

ఈ రాష్ట్రంలో ఎంపీ, ఎమ్మెల్యే లు ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, కబ్జా చేసి అమ్ముకుంటుంటే వారిని అరెస్ట్ చేసి జైలు కు పంపకుండా అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూన్నారని, పాలకులు దొంగలకు వత్తాసు పలుకుతూ ఉండడం సరైంది కాదన్నారు. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ  ప్రభుత్వ దహనకాండను తీవ్రంగా ఖండించారు. వెంటనే కూల్చిన ఇండ్ల స్థలాలోనే ఇంటినిర్మాణం చేసి, వాటికి సంబందించిన పత్రాలతో అర్హులైన వారికి ఇవ్వాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అలాగే అక్రమంగా అరెస్టు చేసిన వారిని, నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేసారు.

ఈకార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యులు పి. అశయ్య, కరీంనగర్ సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవ రెడ్డి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్, సిపిఎం జిల్లా నాయకులు చౌదరి, రమేష్, ఎండి సలీం, మహ్మద్  తదితరులు పాల్గొన్నారు.