ఉపాధి హామీ పనులను తనిఖీ చేసిన జిల్లా అధికారి

ఉపాధి హామీ పనులను తనిఖీ చేసిన జిల్లా అధికారి


గుండాల మార్చ్ 23 (ముద్ర న్యూస్): ఉపాధి హామీ అదనపు జిల్లా అధికారి  జి సురేష్ గుండాల  రామారం గ్రామాలలో చెరువు లో మట్టి తీస్తున్న ప్రదేశాన్ని శనివారం పరిశీలించి మాట్లాడుతూ గ్రామపంచాయతీలలో,ఉపాధి హామీ కూలీలు చేస్తున్నటువంటి పని ప్రదేశాన్ని తనిఖీ చేసి రిజిస్టర్ పరిశీలించి కూలీలకు పని కల్పించాలని అన్నారు,గ్రామములో ఉన్నటువంటి నర్సరీలను పరిశీలించారు,ఈ కార్యక్రమంలో ఉపాధి సిబ్బంది ఏపీఓ ఇమ్మానియేల్ పంచాయతీ కార్యదర్శులు సిహెచ్ రమేష్ టి ఏ లు సోమయ్య పల్లవి ఫీల్డ్ అసిస్టెంట్ నవనీత మత్స్యగిరి తదితరులు పాల్గొన్నారు