మండలానికి అంబులెన్స్ రాకతో వినియోగంలోకి అత్యవసర సేవలు

మండలానికి అంబులెన్స్ రాకతో వినియోగంలోకి అత్యవసర సేవలు

ముద్ర ప్రతినిధి నడిగూడెం:-ఇటీవల మండలానికి అత్యవసర వైద్య సేవల కొరకు కేటాయించిన 108 అంబులెన్స్ ద్వారా నూటికి నూరు శాతం మండల ప్రజలు అత్యవసర వైద్య సేవలు పొందినట్లు జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ నజీరుద్దీన్ తెలిపారు మంగళవారం మండల కేంద్రంలో పాత్రికేయులతో మాట్లాడుతూ గతంలో పక్క మండలంలో వాహనం ఉండటం వలన నడిగూడెం మండల ప్రజలు మండలంలో అత్యవసర వైద్య సేవలు అవసరమైనప్పుడు 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురైనరని అవసరమైనప్పుడు వాహనం అందుబాటులో లేక ఇబ్బందులు పడ్డారని అన్నారు నడిగూడెం మండలానికి ప్రత్యేకంగా అత్యవసర వైద్య సేవల నిమిత్తం 108 వాహనం కేటాయించిన 100 రోజులలో మండల ప్రజలు నూటికి నూరు శాతం ఉపయోగించుకున్నరన్నారు మండలంతో పాటు మోతి మండలంలో కూడా సేవలందించినట్టు తెలిపారు 100 రోజులలో గర్భిణీ స్త్రీలు 60 శాతం యాక్సిడెంట్ కేసులు 53% సూసైడ్ కేసులు 30% ఇతరులు 40 శాతం మంది వైద్య సేవలు పొందారని మండల ప్రజలకు 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు మండల కేంద్రంలో 108 అంబులెన్స్ అందుబాటులో ఉంటుందని తెలిపారు పాత్రికేయుల సమావేశంలో ఏఎంఈ సోమేశ్, పైలెట్లు కాంతారావు , సాగర్ ఈఎంటిలు రవీంద్రబాబు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.