ఉపాధి హామీ కూలీల సమస్యల పరిష్కరించాలి

ఉపాధి హామీ కూలీల సమస్యల పరిష్కరించాలి

కోదాడ, ముద్ర:ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలి అని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు వెలది పద్మావతి అన్నారు. గురువారం మండల పరిధిలోని ద్వారకుంట గ్రామంలో ఉపాధి హామీ కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు మాట్లాడుతూ పనికి వెళ్లాలంటే మూడు నాలుగు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పని దిగే సమయానికి విపరీతమైన ఎండ వేడిమికి వడగాలులకు మహిళలు వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు అని, ఎంత పని చేసినా వంద రూపాయలు మాత్రమే పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 కనీసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు హెల్త్ కిట్లు మంచినీటి సౌకర్యం కల్పించడం లేదని, ఒక్క పూట హాజరు మాత్రమే ఏర్పాటు చేయాలని, మస్టర్ విధానాన్ని తీసుకురావాలని ఆమె దృష్టికి తీసుకుని వెళ్లారు. అనంతరం వెలది పద్మావతి మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు పనికి తగిన ప్రతిఫలం అందించాలని వారికి మంచినీటి సౌకర్యం ఎండ తగలకుండా ఉపశమనానికి టెంటు సౌకర్యం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, పనిముట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేస్తామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు, మెట్లు, సతీష్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.