ప్రతి మహిళ ధైర్యంగా చట్టాల పైన అవగాహన పెంచుకొని ముందడుగు వేయాలి: జిల్లా మొదటి అదనపు  న్యాయమూర్తి కె మారుతి దేవి పిలుపు

ప్రతి మహిళ ధైర్యంగా చట్టాల పైన అవగాహన పెంచుకొని ముందడుగు వేయాలి: జిల్లా మొదటి అదనపు  న్యాయమూర్తి కె మారుతి దేవి పిలుపు

బీబీనగర్ మార్చి 9 (ముద్ర న్యూస్) జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ మరియు జాతీయ మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో బీబీనగర్ మండలములోని నెమరుగోముల గ్రామములో మహిళా చట్టపరమైన హక్కులు సాధికారత అంశంపై న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. కార్యక్రమములో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె మారుతి దేవి మాట్లాడుతూ మహిళా ఇంటికే పరిమతం కాకుండా, అధైర్య పడకుండా చట్టాలపైన అవగాహన పెంచుకొని, కుటుంబ పరంగా, సంఘలో నైతికంగా, ఆర్ధిక పరంగా ఎదగాలని, కోర్టుకు వచ్చే కేసులను చూస్తే మనస్సు చలించి పోతుందని, బాలికలు, మహిళలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కె దశరథ రామయ్య మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ద్వారా న్యాయ సహాయం, న్యాయ సలహా, చట్టాలపై అవగాహన కలుగచేయటం, లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం వంటి విధులు నిర్వర్థిస్తూ, దీనిలో భాగంగా జాతీయ మహిళా కమిషన్ వారి లక్ష్యం ప్రతి మహిళ చట్టాల పట్ల అవగాహన కల్పించుకొని, వారి హక్కుల సాధికారత సాధించుకోవటానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మరియు ఆ సంస్థ విధులపట్ల అవగాహన కల్పించారు.

న్యాయవాదులు ఎన్. రమేష్ కుమార్, జి. శంకర్ కుటుంబ చట్టాలు, గృహహింస, వరకట్న నిషేధం, పి. ఎన్. డి. టి చట్టం మరియు తదితర చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమములో ఎం. పి. పి. యర్కల సుధాకర్ గౌడ్, ఎం. పి. డి. ఒ. శ్రీవాణి, భువనగిరి సి. ఐ. వెంకటేశ్వర్లు, బీబీనగర్  ఎస్. ఐ. సైదులు, గ్రామస్తులు, మహిళా సంఘాలు, అంగన్వాడీ సూపరవైజర్లు, ఉపాధ్యులు పాల్గొన్నారు. చట్టాలపై రూపొందించిన అవగాహన కరపత్రాలను అందచేశారు. కార్యాక్రమములో మహిళా కానిస్టేబుల్స్ లకు సభ నిర్వాహకులు వారి సేవాలకుగాను గుర్తింపు నిస్తూ సన్మానించారు.