కార్పొరేట్, మతోన్మాద అనుకూల విధానాలతో పాటు బిజెపి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి: జూలకంటి రంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే

కార్పొరేట్, మతోన్మాద అనుకూల విధానాలతో పాటు బిజెపి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి: జూలకంటి రంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే

ప్రజలను చైతన్యం చేయడానికే "జన చైతన్య యాత్రలు" జూలకంటి రంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే

నల్గొండ (ముద్ర న్యూస్): కార్పొరేట్ భాజపా మతోన్మాద, కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రత్తికటించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నాడు స్థానిక దొడ్డి కొమురయ్య భవన్లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి  అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, యువజన, విద్యార్థి, కార్మిక, మహిళా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసేందుకు, కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఈనెల 17 నుండి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు జన చైతన్య యాత్రలు చేస్తున్నామని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో ప్రజల మీది  నిత్యావసర సరుకుల ధరలు, ముడి చమురుల ధరలు ఇలా అనేక రకాల పద్దతిలో భారాలు మోపుతూ ప్రజల నడ్డి విరుస్తూ నిరంకుశ పాలన చేస్తున్నారు అని వారు అన్నారు.

 అదేవిధంగా ప్రజల మధ్య కులాల పేరుతో మతాల పేరుతో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ సెక్యులర్ భారతదేశం మీద మతోన్మాద భావాజాలాన్ని వ్యాప్తి చేయాలనే కుట్ర బిజెపి, ఆర్ ఎస్ ఎస్ చేస్తుందని చెప్పారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వాన్ని కలిగిన తెలంగాణ రాష్ట్రంలో బిజెపి మతోన్మాద ఆగడాలు సాగనివ్వమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఒకవైపు ధరల భారం మరొకవైపు మతోన్మాద బావజాలం ప్రభావం చూపుతుంటే బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక రైతు, యువజన, విద్యార్థి, మహిళ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఈనెల 17 నుండి 29 వరకు సాగే జనచైతన్య యాత్రలను జయప్రదం చేయాలని వారు అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ విధానాలతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని, ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ తో వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పథకం నిధుల కుదింపుతో పని దినాలు కోల్పోయి కనీస వేతనం కూడా రాదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ జిల్లాలో పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన అందరికీ పోడు పట్టాలు ఇవ్వాలని, ఇంటి స్థలం లేని నిరుపేదలందరికీ ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మొదలగు సమస్యల పరిష్కారానికి  నల్లగొండ జిల్లాలో మార్చి 27 నుండి 28 వరకు జన చైతన్య బస్సు, మోటార్ సైకిల్ యాత్ర కొనసాగిస్తున్నట్లు తెలిపారు. యాత్ర సందర్భంగా మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్, చిట్యాల కేంద్రాల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సభలలో పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాతంత్ర శక్తులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేశం, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కొండ్రెడ్డి నాగిరెడ్డి, కందాల ప్రమీల, సయ్యద్ హాశం, పాలడుగు ప్రభావతి, సిహెచ్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.