ఖమ్మం జిల్లా సత్తుపల్లికి తొలిసారి పాసింజర్ రైలు - ఆనందంలో ప్రజలు

ఖమ్మం జిల్లా సత్తుపల్లికి తొలిసారి పాసింజర్ రైలు - ఆనందంలో ప్రజలు

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: ఎప్పుడూ...బొగ్గు రవాణా చేసే గూడ్స్‌ ట్రైన్లు రావడమే చూసిన సత్తుపల్లి ప్రజలు.. ఫస్ట్‌ టైమ్‌ పాసింజర్‌ రైలు రాకతో రైల్వే స్టేషన్‌కు పరుగులు తీశారు. అయితే.. ప్రయాణికుల కోసం వచ్చిన ట్రైన్‌ కాదని తెలుసుకుని నిరాశకు గురయ్యారు. వాస్తవానికి.. ఈ పాసింజర్‌ రైలులో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్.. రైల్వే అధికార యంత్రాంగంతో సత్తుపల్లి చేరుకుని సింగరేణి రైల్వే ట్రాక్‌ను పరిశీలించారు.

కొత్తగూడెం నుంచి ఖమ్మం జిల్లా సత్తుపల్లికి తొలిసారి పాసింజర్ రైలు రావడంతో ఆ ప్రాంతవాసుల్లో ఆనందం వెల్లువిరిసింది. ఎప్పుడూ.. బొగ్గు రవాణా చేసే గూడ్స్‌ ట్రైన్లు రావడమే చూసిన సత్తుపల్లి ప్రజలు.. ఫస్ట్‌ టైమ్‌ పాసింజర్‌ రైలు రాకతో రైల్వే స్టేషన్‌కు పరుగులు తీశారు. అయితే.. ప్రయాణికుల కోసం వచ్చిన ట్రైన్‌ కాదని తెలుసుకుని నిరాశకు గురయ్యారు. వాస్తవానికి.. ఈ పాసింజర్‌ రైలులో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్.. రైల్వే అధికార యంత్రాంగంతో సత్తుపల్లి చేరుకుని సింగరేణి రైల్వే ట్రాక్‌ను పరిశీలించారు. ఇటీవల గూడ్స్ రైల్వే ట్రాక్ ఏర్పాటు చేయడంతో కొద్దినెలలుగా సత్తుపల్లి నుంచి కొత్తగూడెంకు గూడ్స్‌ ట్రైన్స్‌ రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే, ప్రత్యేక పాసింజర్‌ రైలులో రైల్వేశాఖ ఉన్నతాధికారులు సత్తుపల్లికి చేరుకుని.. రైల్వే ట్రాక్ సామర్థ్యాన్ని, సింగరేణి బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను స్వయంగా పరిశీలించారు. ఏదేమైనా.. సత్తుపల్లికి పాసింజన్‌ రైలు రావడంపై ఆ ప్రాంత వాసుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.