ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందుల్లేకుండా చూడాలి ఆర్డిఓ కొమురయ్య

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందుల్లేకుండా చూడాలి ఆర్డిఓ కొమురయ్య

కేసముద్రం, ముద్ర: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా సెంటర్ ఇన్చార్జిలు చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ ఆర్డిఓ కొమురయ్య ఆదేశించారు. కేసముద్రం మండలంలోని ధనసరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డిఓ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. వర్షం వస్తున్న నేపథ్యంలో ధాన్యం తడవకుండా రైతులకు అవసరమైన టార్పాలిన్లు సమకూర్చాలని, భారీ వర్షం వచ్చినట్లయితే ధాన్యం వరదలో కొట్టుకుపోకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు నేరుగా పొలం నుండి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకు రాకుండా, ఇంటి వద్ద ఆరబెట్టి తాలు, తేమ లేకుండా చేసి కొనుగోలు కేంద్రానికి తీసుకు వచ్చినట్లయితే వెంట వెంటనే కొనుగోలు నిర్వహించడానికి సులువుగా ఉంటుందని సూచించారు. ఆర్డీవో వెంట తహాసిల్దార్ పులి సాంబశివుడు, ఏవో వెంకన్న, రైతు బంధు మండల కన్వీనర్ దామర కొండ ప్రవీణ్ కుమార్ తదితరులున్నారు. అర్పణ పల్లి గ్రామంలో పడిపోయిన వరిపైర్లను అధికారులు పరిశీలించారు. పడిపోయిన వారిపై కొంతమంది చేసి జుట్టు కట్టాలని, పడిపోయిన వరి పైరు పై ఉప్పు నీటిని పిచికారి చేయడం ద్వారా ధాన్యం మొలకత్తకుండా నివారించుకోవచ్చని సూచించారు. రైతులు అధైర్య పడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.