ఇంటింటి సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి బి ఎల్ ఓ లకు ఆర్డిఓ సూచన

ఇంటింటి సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి బి ఎల్ ఓ లకు ఆర్డిఓ సూచన

కేసముద్రం, ముద్ర: ఓటర్ల జాబితా సవరణ కోసం చేపట్టిన ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేయాలని మహబూబాబాద్ ఆర్డిఓ కొమురయ్య బి ఎల్ వో లకు సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి, కల్వల, కేసముద్రం స్టేషన్ గ్రామాల్లో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని ఆర్డీవో శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ప్రతి రోజు 50 నుంచి 80 ఇండ్లను సందర్శించి ఓటర్ల జాబితాలో తప్పొప్పులను సవరించడంతోపాటు, చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఓటర్ల నుంచి అవసరమైన సవరణల కోసం ఫామ్ 6, 7, 8 ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. ఎండల కారణంగా ఉదయం, సాయంత్రం పూట సర్వే వేగవంతంగా నిర్వహించాలని చెప్పారు. ఆర్డీవో వెంట తహసిల్దార్ పులి సాంబశివుడు ఉన్నారు.