ఘనంగా తల్లిపాల వారోత్సవాలు..

ఘనంగా తల్లిపాల వారోత్సవాలు..

 ముద్ర ప్రతినిధి,రాజన్న సిరిసిల్ల:  తల్లిపాల వారోత్సవాలను రాజన్న సిరిసిల్ల అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్  ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల అకాడమీ ఆఫ్ పెడియాట్రిక్స్   ప్రెసిడెంట్ డాక్టర్ మురళీధర్ రావు  మాట్లాడుతూ,తల్లిపాలు బిడ్డకి కావాల్సినంత  పోషకాలను కలిగి ఉంటాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిపాలని తమ పిల్లలకు ఆరు నెలల వరకు తప్పకుండా ఇవ్వాలని పేర్కొన్నారు.  డాక్టర్ కందేపి ప్రసాద్ రావు గారు మాట్లాడుతూ ముర్రు పాలు అనేటివి బిడ్డలందరికీ తొలి టీకా లాంటివని, ముర్రుపాలు వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని,తల్లిపాలను తప్పకుండా పట్టించాలని తెలియజేశారు.  రాజన్న సిరిసిల్ల జిల్లా అకాడమీ అప్ పీడియాట్రిక్స్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ జి సురేంద్రబాబు  మాట్లాడుతూ తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకే కాకుండా తల్లికి కూడా ప్రయోజనాలు ఉంటాయని తెలియజేశారు. 

బిడ్డకి పాలు ఇవ్వడం ద్వారా తల్లి గర్భధారణ సమయంలో పెరిగిన బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. బిడ్డకు పాలు ఇచ్చే స్త్రీలలో మధుమేహం రక్తపోటు వచ్చే అవకాశం తక్కువ రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పాలు ఇవ్వడం ద్వారా ప్రసవం అనంతరం జరిగే రక్తస్రావం  కూడా తగ్గుతుందని దానిద్వారా తల్లికి మానసిక ఆనందం కలుగుతుందని, బిడ్డకి తల్లికి మధ్య ఆత్మీయ బంధం పెరిగి మాతృభావన మరింత బలపడుతుందని, తప్పకుండా తల్లిపాలను ఇవ్వాలని అన్నారు. ఈ  కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ డాక్టర్ గోపీనాథ్, డాక్టర్ శృతి, డాక్టర్ నలిని, డాక్టర్ లిఖిత, డాక్టర్ సాయికుమార్, డాక్టర్ శ్రవణ్ కుమార్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.