Gutta Amit Reddy - బిఆర్ఎస్ కు షాక్....  కాంగ్రెస్ లో చేరిన గుత్తా అమిత్ రెడ్డి

Gutta Amit Reddy - బిఆర్ఎస్ కు షాక్....  కాంగ్రెస్ లో చేరిన గుత్తా అమిత్ రెడ్డి

ముద్ర న్యూస్ బ్యూరో, హైదరాబాద్:బిఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మరో కీలక నేత పార్టీని వీడారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఏఐసీసీ ఇంఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ సమక్షంలో అమిత్ హస్తం కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి ఉన్నారు. గత కొంతకాలంగా అమిత్ పార్టీ మారతారనే ప్రచారం జోరందుకున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఆయన ఇవాళ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీ మారతారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన మాత్రం అలాంటిదేం లేదని కొట్టిపారేస్తూ వస్తున్నారు. కానీ తాజాగా ఆయన కుమారుడు కాంగ్రెస్ పార్టీని వీడటంతో గుత్తా సుఖేందర్ కూడా కారు దిగడం ఖాయమనే మాట వినిపించింది. అంటే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమoలో గుత్తా జితేందర్ రెడ్డి,చలసాని రాజీవ్ తదితురులు పాల్గొన్నారు.