బీఆర్ఎస్ ​సిట్టింగ్​లకు కీలక పదవులు

బీఆర్ఎస్ ​సిట్టింగ్​లకు కీలక పదవులు
  • ఆర్టీసీ చైర్మన్​గా ముత్తిరెడ్డి.. రైతుబంధు చైర్మన్​గా తాటికొండ
  • నందికొండ శ్రీధర్, ఉప్పలకు ఇతర పదవులు
  • ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు

ముద్ర, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్​పార్టీలో ఇద్దరు సిట్టింగ్​ఎమ్మెల్యేలకు కీలక పదవులు వరించాయి. ఈసారి ఎన్నికల్లో స్టేషన్​ఘన్​పూర్, జనగామ సెగ్మెంట్లలో ఇద్దరు సిట్టింగ్​లకు టికెట్లు మార్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్​వారికి కొత్త పదవులను సర్దుబాటు చేశారు. అసంతృప్తితో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్యను కార్పొరేషన్ చైర్మన్లుగా నియమిస్తూ గురువారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ చైర్మన్​గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని నియమించారు. జనగామ నియోజకవర్గంలో పల్లా రాజేశ్వర్​రెడ్డికి టికెట్​కేటాయించారు. మరోవైపు స్టేషన్​ఘన్​పూర్​ నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు రైతుబంధు కార్పొరేషన్​ చైర్మన్​గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ సెగ్మెంట్​టికెట్​ను కడియం శ్రీహరికి కేటాయించిన విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్​నుంచి ఇటీవల బీఆర్​ఎస్​లో చేరిన నందికొండ శ్రీధర్​కు ఎంబీసీ కార్పొరేషన్​ చైర్మన్​గా, మిషన్​ భగీరథ వైస్​ చైర్మన్​గా ఉప్పల వెంకటేశ్​ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.