ప్రోటోకాల్ పాటించని ఎంపీడీఓ పై కలెక్టర్ కు ఫిర్యాదు

ప్రోటోకాల్ పాటించని ఎంపీడీఓ పై కలెక్టర్ కు ఫిర్యాదు

మహిళా సర్పంచ్ నని అవమానిస్తున్నరు ప్రెస్ మీట్ లో ముత్తారం సర్పంచ్ తూటి రజిత రఫీ

ముద్ర,ముత్తారం: మహిళా సాధికారత మాటల్లోనే గాని చేతల్లో లేదని అందుకు విరుద్ధంగా ముత్తారం ఎంపీడీవో కలికోట శ్రీనివాస్ మండలంలో ప్రోటోకాల్ పాటించకుండా సర్పంచులను అవమానిస్తున్నాడని దీంతో ఎంపీడీవో పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు ముత్తారం సర్పంచ్ తూటి రజిత రఫీ తెలిపారు.శుక్రవారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ బతుకమ్మ చీరల పంపిణీలో భాగంగా మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయాల్సి ఉండగా ఎంపీడీవో శ్రీనివాస్ ప్రోటోకాల్ పాటించకుండా మహిళా సర్పంచ్ నైన తనకు సమాచారం ఇవ్వకుండ అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అధికార పార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరించే అధికారి ఎంపీడీవో  పై కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రెస్ మీట్ లో తెలిపారు.

ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందం మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ లు మాట్లాడుతూ మహిళా సర్పంచ్ అయిన తూటి రజితను ఎంపీడీవో ప్రోటోకాల్ పాటించకుండా సమాచారం ఇవ్వకపోవడం హేయమైన చర్య అని అన్నారు.అధికార పార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్న ఎంపిడిఓ పై కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు.  ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు బక్కతట్ల కుమార్ యాదవ్, గాదం శ్రీనివాస్,గుడి రాములు,బుచ్చం రావు, అనుము గోపాల్,పీక శంకర్, దాసరి చంద్రమౌళి గౌడ్,తీగల సత్యనారాయణ రావు,  తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.