హిమాయత్ సాగర్ రెండు గేట్లు ఎత్తివేత

హిమాయత్ సాగర్ రెండు గేట్లు ఎత్తివేత

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : భారీ వర్షాలు  కురుస్తున్న నేపథ్యంలో   ఇన్‌ఫ్లో పెరగడం హిమాయత్ సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తి నీళ్లను వదులుతున్నారు. మంగళవారం ఉదయం జలమండలి అధికారులు రెండు గేట్లు   (8 &10)  రెండు ఫీట్ల చొప్పున లేపి నీరు ని దిగువకు వదులుతున్నారు.  ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షానికి హిమాయత్ సాగర్ కు భారీగా వర్షపు  నీళ్లు రావడంతో గేట్స్ ఎత్తివేశారు.