తనపై ఆదరాభిమానాలు చూపిస్తున్న అందరికి రుణపడి ఉంటా - మాజీ ఎమ్మేల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి 

తనపై ఆదరాభిమానాలు చూపిస్తున్న అందరికి రుణపడి ఉంటా - మాజీ ఎమ్మేల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి 
  •  షాద్ నగర్ లో ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు 
  • రక్తదాన శిబిరం, అన్న దానం ఏర్పాటు 

ముద్ర, షాద్ నగర్ : షాద్‌నగర్  మాజీ ఎమ్మేల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా  జరిగాయి. షాద్‌నగర్ లోని కుంట్ల రాంరెడ్డి గార్డెన్ లో అభిమానులు ఏర్పాటు చేసిన బర్త్ డే వేడుకల్లో ఫరూక్ నగర్ జడ్పీటిసి పీ. వెంకట్రామిరెడ్డి, కొత్తూరు మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, రెడ్డి సేవా సమితి నాయకులు గుర్రం రవీందర్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, సీపీఐ నాయకుడు శ్రీను నాయక్, ఎమ్మార్పీఎస్ నాయకులు పెంటనోల్ల నర్సింహ మాదిగ, మాజీ జడ్పీటిసి నర్సింగ్ రావు తదితరులు హాజరై ప్రతాప్ రెడ్డినీ సన్మానించారు. కృష్ణ మహేశ్ ప్రజాసేన అద్యక్షుడు ఎండి ఖాదర్ గోరి ఆద్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. 

ఈ సంధర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తనకు రాజకీయంగా సహకారం అందిస్తున్న ప్రజలకు, స్నేహితులకు, రాజకీయ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఆదరాభిమానాలు చూపిస్తున్న అందరికి రుణపడి ఉంటానని ఆయన అన్నారు. ఈ సంధర్భంగా ప్రతాప్ రెడ్డి అభిమానులు రక్తదానం చేశారు.

ఈ కార్యక్రమంలో యువసత్తా లక్ష్మణ్, జాంగారి రవి, రాయికల్ మోహన్ రెడ్డి, సర్పంచ్ సంపత్, కిషన్ నగర్ నేత శంకర్ రెడ్డి, కొత్తూరు సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతాప్ రెడ్డి జన్మదినం సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముండు తన జన్మదినo సందర్భంగా పాలమూకుల గ్రామంలో గురుస్వామి సగృహoలో  శ్రీశ్రీశ్రీ గురుబ్రహ్మ సతీషన్ నాయర్ గురుస్వామి గారి    ఆశీస్సులు  షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి తిసుకున్నారు. షాద్ నగర్ పట్టణం లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రత్యేక పూజలు నిర్వహించన్న షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, ఆలయ అర్చకులు మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డినీ సన్మానించారు. 

మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రమాదేవి శ్రీనివాస్ రెడ్డి, అదే విధంగా ఈదులపల్లి గ్రామ మాజీ సర్పంచ్ స్వప్ప శ్రావణ్ కుమార్, టీఎన్జీవో అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్ లు ఉన్నారు.