తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు

తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు
  • అధికార పార్టీ నుండే ఎక్కువగా కాంగ్రెస్లో చేరుతున్న నాయకులు కార్యకర్తలు
  • తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుంది
  • రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్
  • తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల సామేల్

తుంగతుర్తి ముద్ర:-తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ లోకి వలసలు భారీ ఎత్తున మొదలయ్యాయి. సోమవారం రోజున నియోజకవర్గ పరిధిలో నాగారం తిరుమలగిరి నూతనకల్ మండలాల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిరుమలగిరి మున్సిపాలిటీ ఏడవ వార్డులో 50 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాగారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన 50 కుటుంబాలు మండల పార్టీ అధ్యక్షుడు తుడుసు లింగయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నూతనకల్ మండలం ఎర్రపహాడ్ గ్రామంలో వివిధ పార్టీల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో అభ్యర్థి మందుల సామేల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లోని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించారు .ఈ సందర్భంగా మందులు శామ్యూల్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అధికార పార్టీ ఆగడాలు మితిమీరిపోయాయని అభివృద్ధి కుంటుబడిపోయిందని అన్నారు .రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. రానున్న నాలుగైదు రోజుల్లో నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల్లో అధికార పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ ఎత్తున వలసలు ఉంటాయని సామేలు అన్నారు. ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్కు ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని ఎన్ని అడ్డంకులు సృష్టించిన కాంగ్రెస్ గెలుపును ఆపలేరని అన్నారు .ఈ సందర్భంగా మందుల శామ్యూల్ వెంట జిల్లా డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు, నూతనకల్ మండల పార్టీ అధ్యక్షుడు నాగం సుధాకర్ రెడ్డి లతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.