బుద్వేల్ వేలానికి భారీ స్పందన

బుద్వేల్ వేలానికి భారీ స్పందన
  • 100 ఎకరాలకు రూ.3,625 కోట్ల ఆదాయం 

ముద్ర, తెలంగాణ బ్యూరో : భూముల వేలం రూపంలో సర్కారు ఖజానాకు మరోసారి కాసుల వర్షం కురిసింది. గురువారం రంగారెడ్డి జిల్లాలోని బుద్వేల్ లో 100.01 ఎకరాల భూమికి వేలం నిర్వహించగా మొత్తం 3,625.73 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో అత్యధికంగా ఒక ఎకరాకు రూ.41.25 కోట్లు రాగా, అత్యల్పంగా రూ.33.25 కోట్ల ధర పలికింది. రెండు సెషన్లవారీగా ఈ వేలం నిర్వహించారు. ఉదయం 7 ఓపెన్ ప్లాంట్లు (58.11 ఎకరాల)కు వేలం వేయగా రూ.2,057 కోట్ల ఆదాయం వచ్చింది. మధ్యాహ్నం రెండో విడతగా వేసిన వేలంలో మరో పద్నాలుగు ప్లాట్లు (41.90 ఎకరాల)కు రూ. 1,568.06 కోట్ల ఆదాయం వచ్చింది.