స్థంభంపల్లిలో దారుణ హత్య

స్థంభంపల్లిలో దారుణ హత్య
  •  ఈల పీఠతో తల నరికి హత్య చేసిన భర్త
  • కుటుంబ కలహాలు, అనుమానమే హత్యకు కారణం
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు 

ముద్ర వెల్గటూర్ : కుటుంబంలో చెలరేగిన చిన్నపాటి కలతలు, అనుమానాలు ఆత్మీయులను అందనంత దూరం చేస్తున్నాయి. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు కుటుంబానికి, వారికి పుట్టిన పిల్లలకు శాపంగా మారుతున్నాయి.

 జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లిలో బొల్లం జగదీష్ అనే వ్యక్తి అతని భార్య రాజేశ్వరిని తల నరికి హతమార్చిన సంఘటన మనవత్వం మంటగలిసే విధంగా ఉంది. 

పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం వెల్గటూర్ మండలంలోని ముత్తునూరు గ్రామానికి చెందిన కండ్లే దేవయ్య,ఎల్లమ్మ దంపతుల కూతురు రాజేశ్వరిని మండలంలోని స్తంభంపల్లి గ్రామానికి చెందిన బొల్లం జగదీష్ కి ఇచ్చి 2016 లో వివాహం చేశారు. వివాహ సమయంలో వరుడికి ఇయ్యాల్సిన కట్న,కానుకలను ముట్ట చెప్పారు. కొన్నాళ్ళ పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. గత రెండు సంవత్సరాల నుంచి వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. హంతకుడైన జగదీష్ పని లేకుండా జులయి గా తిరుగుతూ తాగుడుకు బానిస అయ్యాడు. కుటుంబ పోషణ భారమైంది. ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దీనికి తోడు భార్య రాజేశ్వరిపై అనుమానం పెంచుకున్నాడు. పలుమార్లు బావమరిదికి ఫోన్ చేసి నీ చెల్లి నాకు వద్దు తీసుకుపో అని చెప్పేవాడు. గతంలో ఒకసారి పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ కూడా జరిగింది. జగదీష్ లో మార్పు రాకపోగా తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. వీరి పెళ్లి రోజు మార్చి 28 మరోసారి బావమరిది ఇంటికి వచ్చి గొడవలు పడకుండా కలిసుండమని సర్ది చెప్పి వెళ్ళాడు.

బుధవారం కూర వండటానికి నూనె పాకెట్ తేవాలని భార్య సాయంత్రం భర్తకు చెప్పింది. నన్ను నూనె తెమ్మంటావా అంటూ భార్యతో జగదీశ్ గొడవ పెట్టుకున్నాడు. అగొడవ కాస్త పెద్దదయి అర్ధరాత్రి వరకు కొనసాగింది. అనంతరం పిల్లల తో పాటు రాజేశ్వరి నిద్ర పోయింది. అప్పటి కే మద్యం సేవించు ఉన్న జగదీష్ నిద్రపోతున్న భార్య పై ఇంటిలోని కత్తిపీటతో విచక్షణా రహితంగా దాడి చేసి నరికి చంపాడు. ఈ దాడిలో రాజేశ్వరి మెడ చేతుల పై బలమైన గాయాలు కాగా తీవ్రంగా రక్త స్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందింది. హత్య సమయంలో జరిగిన అరుపులు విని కొడుకు నిద్రలేచి చూడగా జగదీష్ ఇంటిలో నుంచి పరారయ్యాడు. అమ్మను పిలిస్తే పలకపోగా భయాందోళనకు గురైన జగదీష్ కొడుకు పక్క రూములో పడుకున్న నానమ్మకు వద్దకువెళ్లి జరిగిన విషయం చెప్పాడు.వారు పోలీస్ లకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బంధువుల ఫిర్యాదు మేరకు మృతదేవాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు సిఐ బిళ్ళ కోటేశ్వర్ ఎస్సై నరేష్ తెలిపారు.