నాకు భద్రత లేదు:  కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్​ మాలిక్​

నాకు భద్రత లేదు:  కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్​ మాలిక్​

న్యూఢిల్లీ: కేంద్రం తనకు కల్పించిన భద్రతను తగ్గించినట్టు జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్  తెలిపారు.  తనకు ఏదైనా జరిగితే కేంద్రానిదే బాధ్యతని సంచనల వ్యాఖ్యలు చేశారు. జడ్ ప్లస్ క్యాటగిరి స్థానంలో ఒక పర్సనల్ సెక్యూరిటీ అధికారినిను మాత్రమే తనకు కేటాయించారని తెలిపారు. రైతు సమస్యలు, కేంద్ర ప్రభుత్వ అగ్నివీర్ పథకంపై మాట్లాడినందుకే తనకు కల్పించిన భద్రతను కేంద్రం వెనక్కి తీసుకుందని 'ఇండియా టుడే'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఆరోపించారు.

జమ్మూకశ్మీర్, మేఘాలయ, గోవా గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్ సేవలందించారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను 2019లో రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలగా విభజించిన సమయంలో సత్యపాల్ మాలిక్ జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా ఉన్నారు. కొద్ది నెలల తర్వాత గోవాకు 18వ గవర్నర్‌గా ఆయనను పంపారు. మేఘాలయ 21వ గవర్నర్‌గా 2022 అక్టోబర్ వరకూ ఆయన సేవలందించారు.