IBM Announce Layoffs: జాబ్ కట్ దిశగా ఐ బి ఎం

IBM Announce Layoffs: జాబ్ కట్ దిశగా ఐ బి ఎం
IBM Announce Job Cuts In Latest Tech Layoffs

న్యూయార్క్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగులకు ఇది మరో పిడుగు లాంటి వార్త. ఈ కామర్స్ దిగ్గజ సంస్థ Amazon to Cut 18,000 Jobs అమెజాన్ 18,000 ఉద్యోగాల కోత విధించిన కొద్ది రోజులకే కంప్యూటింగ్ రంగంలో భారీ వ్యాపారం నిర్వహించే ఐబీఎం సంస్థ 3900 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది.

IBM New York based company న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే ఐబీఎం సంస్థ ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఈ జాబ్ కట్స్ ద్వారా 300 మిలియన్ డాలర్ల ఖర్చును తగ్గించుకోనున్నట్లు వెల్లడించింది. ఈ చర్య గత ఏడాది వ్యాపార ఫలితాలను బట్టి గాని 2023 సంవత్సరానికి వేసిన అంచనాలను బట్టి గాని ఈ నిర్ణయం తీసుకోలేదని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.