స్విగ్గీతో జతకట్టిన IRCTC

స్విగ్గీతో జతకట్టిన IRCTC

ముద్ర, సెంట్రల్ డెస్క్:- ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మరో అడుగు ముందుకేసింది. రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీతో ఒప్పందం కుదుర్చుకుంది.తొలి దశలో నాలుగు రైల్వే స్టేషన్లలో స్విగ్గీ పుడ్ డెలివరీ సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రారంభ దశలో స్విగ్గీ పుడ్ ఆర్డర్ల సౌకర్యం బెంగళూరు, భువనేశ్వర్, విజయవాడ, విశాఖపట్నం రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి రానున్నాయి.