ఎక్సెల్‌ కంపేనీలో కొనసాగుతున్న ఐటీ సోదాలు..

ఎక్సెల్‌ కంపేనీలో కొనసాగుతున్న ఐటీ సోదాలు..

ఎక్సెల్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ లో రెండవరోజు కుడా ఐటీ సోదాలు కొనసాగాయి. ఆరుగురు డైరెక్టర్ల ఇళ్ళతో పాటు 40 చోట్ల  ఐటీ సోదాలు జరుగుతున్నాయి. గత 30 ఏళ్లుగా ట్యూబ్‌ ల తయారీదారుగ ఎక్సెల్‌ కంపెనీ,  దేశ విదేశాలకు  రబ్బరు టైర్లను ఎగుమతి చేస్తోంది. ఎక్సెల్‌ కు అనుబంధంగా విలాస్‌ పాలిమర్స్‌.. ఏస్‌, స్పిన్‌ మ్యాక్స్‌ కంపేనీలు వున్నారు.గత 30 ఏళ్లలో వేలకోట్ల వ్యాపారం చేసినట్లు గుర్తించారు. 
రబ్బర్‌ ఎక్స్పోర్ట్స్‌ అండ్‌ ఇంపోర్ట్స్‌ లో భారీగా అవకతవకతవకలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఎక్సెల్‌ గ్రూప్‌ లోకి లండన్‌ నుండి 500 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చినట్లు సమాచారం. పన్ను చెల్లింపులు విదేశీ పెట్టుబడులపై ఐటీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. టీపీసీసీ సమన్వయకర్త అనిరుద్‌ రెడ్డి భార్య ఎక్సెల్‌ మంజుష గంగారం  కంపెనీలో డైరెక్టర్‌ గా వున్నారు.