జిల్లాలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు - జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజులు ఏప్రిల్ 1నుండి 30 వరకుపాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని అన్నారు . శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ సూచించారు. కాబట్టి జిల్లా ప్రజలు పోలీసులకు ఈ విషయంలో సహకరించాలని శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని కోరారు.