వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఆత్మీయ సమ్మేళనాలు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఆత్మీయ సమ్మేళనాలు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రభుత్వ  వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికేబి అర్ యస్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్రంలోని బలహీనవర్గాలు గిరిజనులు, రైతులు, దళితులు మైనార్టీలు ఇలా అన్ని వర్గాల ప్రజలు సీఎం కేసీఆర్ దోపిడీకి గురవుతున్నారని అన్నారు. 2018 నుండి బీసీ యాక్షన్ ప్లాన్ కనుమరుగు అయ్యిందని,80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఏడాది గడవగ కేవలం 17 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి, టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీతో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని అన్నారు. 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెలుగు వారి ఆత్మగౌరవం అంటున్న మంత్రి కేటీఆర్..వ్యవసాయ అనుబంధ చక్కర ఫ్యాక్టరీలు ఇక్కడి ప్రజల ఆత్మగౌరవం కాదా అని ప్రశ్నించారు. ఇకనైనా వాస్తవాలను గ్రహించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని హితవు పలికారు.బిజెపి, బీఆర్ఎస్ లకు  ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని అన్నారు. ఈ సమావేశంలో  డిసిసి అధ్యక్షుడు  ఆడ్లూరీ లక్ష్మణ్ కుమార్, పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, పిసిసి ఆర్గనైజింగ్ కార్యదర్శి బండ శంకర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లి దుర్గయ్య, పిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా, రాజేష్, లైసెట్టి విజయ్, అభిలాష్ పాల్గొన్నారు