ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన జడ్పిటిసి రాపోలునరసయ్య

ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన జడ్పిటిసి రాపోలునరసయ్య

నేరేడుచర్ల, ముద్ర:-నేరేడుచర్ల జడ్పిటిసి రాపోలు నరసయ్య మంగళవారం బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరగా నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. హుజూర్నగర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాద సభ జరుగుతుండగా మరొకవైపు బి ఆర్ఎస్ పార్టీకి చెందిన జడ్పిటిసి రాపోలు నరసయ్య కాంగ్రెస్ పార్టీ లో చేరడం చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొణతం చిన్న వెంక రెడ్డి కౌన్సిలర్ బచ్చలకూరి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.