ఎమ్మెల్యే కుంభం ను కలిసిన జైనపల్లి కాంగ్రెస్ నాయకులు 

ఎమ్మెల్యే కుంభం ను కలిసిన జైనపల్లి కాంగ్రెస్ నాయకులు 

 ముద్ర ప్రతినిధి, బీబీనగర్: భువనగిరి శాసన సభ్యుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని హైద్రాబాద్ లోని ఆయన నివాసంలో బీబీనగర్ మండల పరిధిలోని జైనపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. తమ గ్రామానికి రావాలని ఆహ్వానించారు. 


ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,బెజెంకి నరేందర్ రెడ్డి, పార్టీ  గ్రామశాఖ అధ్యక్షులు దూడల మధు గౌడ్,నాయకులు కోమటిరెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి,ఉగ్గి మల్లేష్,బాలనర్సింహ గౌడ్, మహేష్, అమరేందర్ రెడ్డి, బాలకృష్ణ గౌడ్, రాజు,రాంచందర్,వెంకటేష్,రవీందర్,కర్ణాకర్,భాను,జహంగీర్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.