ఆక్రమణకు గురైతున్న ప్రభుత్వ కుంటను రక్షించాలి

ఆక్రమణకు గురైతున్న ప్రభుత్వ కుంటను రక్షించాలి

ముద్ర ప్రతినిధి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం లోని కొండమడుగు గ్రామ పంచాయితీ పరిధిలోని ప్రభుత్వ భూమిని అక్రమదారుల నుండి రక్షించాలని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు అతహర్ డిమాండ్ చేశారు. అతహర్ విలేకరులతో మాట్లాడుతూ కొండమడుగు గ్రామ పంచాయితీ పరిధిలో గల సర్వే నెంబర్ 278 సవుట కుంట లో దాదాపు 7 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు మట్టి పోసి పూడ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పక్కన ఉన్న వారి వెంచర్ లో దాదాపు 9 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసి ప్లాట్లు చేశారని ఆరోపణలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూక్రమణలో అధికార పార్టీ కి సంభందించిన ఒక మండల ప్రజాప్రతినిధి ఉండడం బాధకరమని వాపోయారు. త్వరలో గ్రామస్తులతో పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు.గ్రామ పంచాయితీ లో కూడా కుంట అని ఉన్నా కూడా ఎలా పూడుస్తారని ప్రశ్నించారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమదారుల పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.త్వరలో అన్ని ఆధారాలతో సీబిఐ అధికారులను కలిసి దర్యాప్తు చేయమని కోరతామని తెలిపారు.