తెలంగాణను సర్వనాశనం చేసిన కెసిఆర్

తెలంగాణను సర్వనాశనం చేసిన కెసిఆర్
  • 5 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం
  • ఉన్మాదిలా మాట్లాడుతున్న బండి సంజయ్
  • కాంగ్రెస్ వస్తే 500 కే సిలిండర్
  • సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : కెసిఆర్ అహంకార ధోరణితో తెలంగాణను సర్వనాశనం చేసిండని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం నాగం పేట కు చేరుకుంది ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. ప్రజలు చెల్లించే పన్నులతో ఖజానానుంచి జీతాలు తీసుకునే పోలీసు అధికారులు సైతం ఇసుక మాఫియా కోసం పనిచేయడం దారుణం అన్నారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక ప్రభుత్వం ఉండడం బాధాకరం అన్నారు. తెలంగాణలో సంపద అంతా మాయమై 5 లక్షల కోట్లు అప్పు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగాలు రాలేదు. రాకరాక నోటిఫికేషన్లు వస్తే ప్రశ్నాపత్రాల లీకేజీ చేసి వాళ్లకు సంబంధించిన మనుషులకు అమ్ముకున్నారని ఆరోపించారు.

నిత్యవసర వస్తువుల ధరలు పెంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలతో ఆడుకుంటున్నాయి అని ఉన్నారు. కేంద్రం గ్యాస్, నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది.  బండి సంజయ్ ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ  మాయమాటలు చెబుతున్నాడని మండిపడ్డారు. 42 వేల కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం నిరుపయోగంగా మిగిలిందన్నారు. సాక్షాత్తు, ప్రధాని నరేంద్రమోదీ, దేశ హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ వస్తారు కేసీఆర్ అవినీతి చిట్టా ఉందని చెబుతారు. కాళేశ్వరం ఏటీఎంలా మారిందని అంటారు. కానీ ఏరకమైన విచారణ జరిపించరు. ఎందకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. ప్రధానమంత్రి, హోంమంత్రి స్థాయి వ్యక్తుల ఆధారాలు లేకుండా మాట్లాడరు కదా రిపోర్టులు, ఆధారాలు అన్ని ఉన్నా కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవడం లేదు. మాటలకే పరిమితమవుతూ తెలంగాణ ప్రజల్ని, సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

వచ్చేది మేమే ఏటా రెండు లక్షల ఉద్యోగాలిస్తాం వాళ్లని  లోపలేస్తాం వీళ్లని లోపలేస్తాం అంటూ బండి సంజయ్  ఉన్మాదిలా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా ప్రజాప్రభుత్వమైన ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర లక్ష్యాలైన నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవాన్ని తీసుకురావడం రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుంది.  2023లో కాంగ్రెస్ పార్టీ తప్పక గెలుస్తుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే  2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షలు, 500 కె గ్యాస్ సిలండర్, స్థలాలు లేని పేదలకోసం.. భూమిని సేకరించి ప్లాటింగ్ చేసి స్థలాలు ఇస్తాం అని వెల్లడించారు.  రైతులకు ఏకకాలంలో  2 లక్షల రుణమాఫీ చేస్తాం అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కరీంనగర్ డిసిసి అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ బల్మూరి వెంకట్ తోపాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.