సద్దన్నం తిని..కూలీలతో ముచ్చటించిన కౌశిక్ రెడ్డి

సద్దన్నం తిని..కూలీలతో ముచ్చటించిన కౌశిక్ రెడ్డి

వీణవంక ,ముద్ర: శాసన మండలి సభ్యులు విప్ పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల హుజురాబాద్ నియోజకవర్గంలో ఇంటి ఇంటికి కౌశిక్  అనే కార్యక్రమం చేపట్టి ,కళ్యాణ లక్ష్మీ, షాధి ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్  వంటి చెక్కులను నేరుగా లబ్దిదారులకు అందజేస్తున్నారు. అందులో భాగంగా జమ్మికుంట మండలం కోరపల్లి - కావులపల్లి గ్రామాల వద్ద అటుగా వెళ్తున్న విప్ కౌశిక్ రెడ్డి అక్కడ ఉన్న వ్యవసాయ మహిళా  కూలీల వద్ద " సద్దన్నం "తింటూ.. కాసేపు ముచ్చటించారు. అక్కడ ఉన్న మిగతా కూలీలు సైతం తమ వెంట తీసుకొచ్చిన సద్దన్నం లోని ముద్దను కౌశిక్ రెడ్డి కి తినిపించి వారి అభిమానాన్ని చాటు కున్నారు .అనంతరం కౌశిక్ రెడ్డి సద్దన్నం తింటూ... కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ,ప్రతి కుటుంబానికి  అందరికి లబ్ది చేకూరుతుందని అన్నారు.గతంలో కరెంటు కోతలు ఉండేవని ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఇరవై నాలుగు గంటలు వస్తుందని తెలిపారు. ఇటీవల అకాల వర్షం వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు పది వేలు సీఎం కేసీఆర్ అందిస్తున్నారని అన్నారు.