గంజాయి రవాణాపై ఉక్కు పాదం

గంజాయి రవాణాపై ఉక్కు పాదం
  • అత్యాశకు పోయి అక్రమంగా డబ్బులు సంపాదించాలని జైలు పాలు కావద్దు
  •  31 లక్షల విలువ గంజాయి స్వాధీనం చేసుకున్న కోదాడ రూరల్  పోలీస్.
  • జిల్లా ఇంచార్జ్ ఎస్పీ మేక నాగేశ్వరరావు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-అక్రమంగా అత్యాశకు పోయి డబ్బులు సంపాదించాలని ధ్యాసలో జీవితాన్ని కోల్పోవద్దని జైలు పాలు కావద్దని గంజాయి పై ఉక్కు పాదం మోపుతున్నామని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని గంజాయి అక్రమ రవాణా అడ్డుకట్టకు మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని సూర్యాపేట ఇన్చార్జ్ ఎస్పి మేక నాగేశ్వరరావు చెప్పారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నూతన ఎస్పీ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. రామాపురం క్రాస్ రోడ్డు వద్ద కోదాడ పోలీసులు తనిఖీలు చేపట్టగా 31 లక్షల 25 వేల రూపాయల విలువ చేసే 125 కేజీల 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న మహారాష్ట్ర కు చెందిన డ్రైవర్ అసిఫ్ ఖాన్ చేపల వ్యాపారం చేసే మహమ్మద్ ఇమ్రాన్లను అరెస్టు చేయడం జరిగిందని ఆయన వివరించారు గంజాయితోపాటు గంజాయితోపాటు ఒక మారుతి సుజుకి కారు మూడు సెల్ ఫోన్ లను ఫోన్ లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు మహారాష్ట్రలోని ముంబై పట్టణానికి చెందిన నిందితులు ఇద్దరు కుటుంబ ఖర్చులకు తమ జల్సాలకు డబ్బులు  సరిపోనందున ఏదైనా అక్రమ వ్యాపారం చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలని అత్యాశతో ముంబైలో గంజాయి అమ్మే డబ్బులు సంపాదించే వారిని ఆదర్శంగా తీసుకొని తాము కూడా గంజాయి తీసుకొచ్చి విక్రయించడానికి పథకం వేశారని వెల్లడించారు తమ పథకంలో భాగంగా సుజుకి కారులో ముంబై నుండి ఒరిస్సా కు వెళ్లి అక్కడ తప్త పనీ ప్రాంతంలో 125 కిలోల 100 గ్రాముల గంజాయిని కేజీ ₹1000 చొప్పున కొనుగోలు చేసి మొత్తం 61 కారు వెనక సీటు కింద  డిక్కీ డిక్కీలో కనపడకుండా పెట్టుకొని పోలీసు వారి కదలికలను గమనిస్తూ కోదాడు సమీపంలోని రామాపురం వద్దకు చేరుకున్నారని పోలీసులు కారును ఆపే ప్రయత్నం చేయగా అతివేగంగా వెళ్లి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టారని కారుతో సహా గంజాయిని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సమక్షంలో స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్కు తరలించడం జరిగిందని ఇంచార్జ్ ఎస్పి నాగేశ్వరరావు వివరించారు. వీరిపైన క్రైమ్ నెంబరు 194 అండర్ సెక్షన్ 20b (ii)C,NDPS Act 1985, ఇండియన్ పీనల్ 279 కింద కోదాడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

కోదాడ డి.ఎస్.పి.బి ప్రకాష్  ఆద్వర్యములో  గంజాయి నిందితులను పట్టుబడిచేసి, 125.100 కే‌జిల గంజాయి, ఒక మారుతీ సుజుకి కారు, మూడు సెల్ ఫోన్ లు స్వాధీనము చేసుకోవడములో చాకచక్యత ప్రదర్శించిన  కోదాడ రూరల్ సీఐ డి.రామకృష్ణా రెడ్డి, ఎస్ ఐ లు కోదాడ రూరల్ సాయిప్రంశాంత్, గరిడేపల్లి-2 ఇబ్రాహీం, బి.లింగా రెడ్డి, ఏ ఆర్ ఎస్ ఐ ఏ వెంకన్న హెడ్ కానిస్టేబుల్  కే వెంకటేశ్వర్లు, ఏ వెంకయ్య, ఎస్ కే సైదులు, ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ ఎం ప్రేమజ్యోతి సెక్షన్ ఆఫీసర్ కే తిరుపతిరెడ్డి తిరుపతిరెడ్డి జూనియర్ అసిస్టెంట్లు ఏ మధు ఎస్కే జానీ పాషా లను  సూర్యాపేట జిల్లా  ఇన్ ఛార్జి ఎస్పీ మేక నాగేశ్వర్ రావు  అభినందించినారు.