ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలి..

ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలి..
  • బీఆర్ఎస్ డిమాండ్..ధర్నా

మెట్‌పల్లి ముద్ర :- ప్రజలకు ఇబ్బందిగా ఉన్న ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని బీఆర్ఎస్  నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ నాయకత్వం పిలుపు మేరకు పట్టణంలోని పాత బస్టాండ్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.

బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను ప్రవేశ పెట్టినపుడు  వ్యతిరేకించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎలా ప్రారంభించారని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ ను రద్దు చేసేవరకు ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రణవేణి సత్యనారాయణ, మొరపు గంగాధర్, బంగారు కాళ్ళ కిషోర్ ,లంక గంగాధర్, మన్నే  ఖాన్ , జావిద్, మార్గం హనుమాన్లు, ధ్యావనపల్లి రాజారాం, ఏనుగందుల శ్రీనివాస్ గౌడ్, ఒజ్జెల శ్రీనివాస్, బర్ల రమేష్, లింగంపల్లి సంజీవ్, ఆకుల ప్రవీణ్, గజం రవి, మొరపు తేజ, శివ, భరత్, షేక్ నవాబ్, బర్ల అర్జున్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.