ఇక్కత్ పరిశ్రమ రిసార్ట్ సెంటర్ గా మార్చాలి

ఇక్కత్ పరిశ్రమ రిసార్ట్ సెంటర్ గా మార్చాలి
  • ఎమ్మెల్యే ను కలిసిన టై అండ్ డై నాయకులు

భూదాన్ పోచంపల్లి,ముద్ర:-పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కును ఇక్కత్ పరిశ్రమ రిసార్ట్ సెంటర్ గా మార్చాలని టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షులు భారత లవకుమార్ అన్నారు.శనివారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలో నూతనంగా ఎన్నికైన టై అండ్ డై అసోసియేషన్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తడక వెంకటేష్ ఆధ్వర్యంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు.

ఈ సందర్భంగా లవ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున నూతనంగా డిజైనింగ్ సెంటర్లను ఏర్పాటు  చేసి హ్యాండ్లూమ్ టెక్నాలజీ కాలేజీని ప్రారంభించాలని కోరారు. అదేవిధంగా పోచంపల్లికి టూరిజం బస్సులను పున ప్రారంభించి చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు .ఈ కార్యక్రమంలో టై అండ్ డై గౌరవ అధ్యక్షులు కర్నాటి బాలరాజు,ఉపాధ్యక్షులు ఈపూరి ముత్యాలు,కుడికాల రామ్ నరసింహ ,ప్రధాన కార్యదర్శి ముస్కూరి నరసింహ ,సహాయ కార్యదర్శులు గంజి బాలరాజు , వనం దశరథ ,కార్యవర్గ సభ్యులు సీత భవాని,రచ్చ భాస్కర్ ,కండగట్ల శంకరయ్య,వేముల నరేష్ , నామాల శ్రీనివాస్, కడవేరు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.