నోట్ల కట్టలతో మంథనిలో అన్నదమ్ములను నాయకులను కొంటున్నారు

నోట్ల కట్టలతో మంథనిలో అన్నదమ్ములను నాయకులను కొంటున్నారు
  • మంథనిలో బీసీ బిడ్డ కు నాల్గోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన కేసీఆర్ కు కృతజ్ఞతలు
  • ఈ ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో గెలవబోతున్నాం
  • మంథనిలో విలేకరుల సమావేశం లో ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: నోట్ల కట్టలతో మంథనిలో అన్నదమ్ములు ఇద్దరు  నాయకులను కొంటున్నారని, వారికి ప్రజలు ఓటుతో బుద్ది చెప్పలనీ, మంథనిలో బీసీ బిడ్డ కు ఎమ్మెల్యేగా నాల్గోసారి అవకాశం ఇచ్చిన కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, ఈ ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో గెలవబోతున్నామనిమంథనిలో సోమవారం విలేకరుల సమావేశం లో పెద్దపల్లి జడ్పీ చైర్మన్, మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు అన్నారు. మంథని నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు  బీఆర్ఎస్, బిజెపి నాయకులను కొనుగోలు చేస్తున్నారని రాత్రికి రాత్రే ఇళ్లల్లోకి పోయి భయభ్రాంతులకు గురిచేసి పార్టీలు మారాలని బెదిరిస్తూ కండువాలు కప్పుతున్నారని,  పుట్ట మధు అన్నారు. ఇటీవల కాలంలో కాటారంలో ఐలయ్య యాదవ్ అనే బీఆర్ఎస్ నాయకుడిని బెదిరించి పార్టీ మార్చారని అన్నారు.  అలాగే ఇతర మండలాలలో కూడా అన్నదమ్ములు ఇద్దరు భయ బ్రాంతులకు గురిచేస్తూ,  ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వారికి మంతిని నియోజకవర్గంలోని ప్రజలు, మహిళలు, యువత ఓటుతో బుద్ధి చెప్పాలని పుట్ట మధు కోరారు. 

మంథని లో సీఎం కేసీఆర్ పాల్గొననున్న ప్రజా ఆశీర్వాద సభను మంథని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఆశీర్వదించాలి

-పుట్ట మధు

మంథని లో మంగళవారం సీఎం కేసీఆర్ పాల్గొననున్న ప్రజా ఆశీర్వాద సభను మంథని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఆశీర్వదించాలని మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు పిలుపునిచ్చారు. సభస్థలిని పరిశీలించిన అనంతరం ఆయన మంత్రి బీఆర్ఎస్ ఎన్నికల పరిశీల గుడి శంకర్ రెడ్డి తో కలిసి మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రజా ఆశీర్వాద సభలో మంథని నియోజక వర్గంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఆయన వెంట భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షణ రాకేష్,  మంథని జడ్పిటిసి తగరం సుమలత శంకర్ లాల్,  బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఏగోళపు శంకర్ గౌడ్, మంథని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఆరేపల్లి కుమార్, ప్రచార కమిటీ చైర్మన్ సెగ్గం రాజేశం, బీఆర్ఎస్ నాయకులు పుదారి సత్యనారాయణ గౌడ్,  కార్యకర్తలు పాల్గొన్నారు.