ఆరోగ్యవంతమైన నగరంగా మార్చేందుకు చర్య లు

ఆరోగ్యవంతమైన నగరంగా మార్చేందుకు చర్య లు

రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : పట్టణ పారిశుధ్యానికీ అధిక ప్రాముఖ్యతను ఇచ్చి ఇంకా మెరుగు పరుస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ అభివృద్ధి, పారిశుధ్య మెరుగులో భాగంగా శనివారం రోజు మంత్రి గంగుల కమలాకర్ నగరపాలక సంస్థ కార్యాలయాన్ని సందర్శించారు. నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, బదిలీ కమీషనర్ సేవా ఇస్లావత్, పాలకవర్గ సభ్యులతో కలిసి ఓనర్ కం డ్రైవర్ స్కీం లో 1.70 కోట్ల రూ.తో 20 స్వచ్చ్ ఆటోలకు ప్రతిపాధన చేయగా  అందులో 93 లక్షల 50 వేల విలువ చేసే 11 స్వచ్చ్ ఆటోలను ప్రారంభించారు. ఆనంతరం మేయర్ చాంబర్ లో విలేకరులతో మంత్రి  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో కరీంనగర్ పట్టణం ఆరోగ్యవంతంగా ఉండాలనే సంకల్పంతో నగర పారిశుద్యాన్ని రోజు రోజుకు మెరుగు పరుస్తున్నట్లు తెలిపారు. గతంలోనే లారీ మౌంటెడ్ స్లీపింగ్ యంత్రాలను, డ్రైన్ క్లీనింగ్ జెట్టింగ్ యంత్రాలను కొనుగోలు చేశామని తెలిపారు. ఈ యంత్రాల ద్వారా డ్రైనేజీలలో సిల్టును తొలగించడం ద్వారా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరంలో ఎక్కడ వరద ఇబ్బందులు రాలేవన్నారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా డ్రైనేజీలను విస్తరించి నిర్మాణం చేయడం తో పాటు డ్రైనేజీల్లో సిల్టు లేకుండ తొలగింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 

కరీంనగర్ నగరం ఆరోగ్య వంతమైన నగరంగా ఉండేలా ఎక్కడ చెత్త చెదారం కనబడకుండ చర్యలు తీస్కుంటూ అంటు వ్యాధులు, విషజ్వరాలు ప్రభలకుండా నగరపాలక సంస్థ ద్వారా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణీ పాలకవర్గ సభ్యులు అంతా ప్రజలకు సౌకర్యాలు కల్పించడం, ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడంలో, జీవణ ప్రమాణాలు పెంచడంలో ప్రాధాన్యత ఇస్తున్నారని వారికి ప్రత్యేకంగా అభినందించారు. నగర పారిశుధ్యం మెరుగ్గా ఉండేలా చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపారు. గతంలో లాగా నగరంలో చెత్త కుండిలు ఉండటం వాటి చుట్టు పందులు విహారం చేయడం, రోడ్ల పై డ్రైనేజీ మురుగు నీరు పొంగడం లాంటివి లేవని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడ ఇదే విధంగా పారిశుధ్యం మెరుగ్గా కొనసాగుతుందని అన్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉన్న యంత్రాలు, వాహానాలకు అదనంగా ఓనర్ కం డ్రైవర్ స్కీం కింద 1.70 కోట్ల తో 20 స్వచ్చ్ ఆటోలకు అనుమతి తీస్కోని 11 స్వచ్చ్ ఆటోలను ఈ రోజు ప్రారంభం చేశామన్నారు. ఇంకా పారిశుధ్యం మెరుగు పడే విధంగా ఈ వాహానాలను కొనుగోలు చేశామన్నారు. ప్రస్తుతం నగరపాలక సంస్థకు ఇన్ని అవార్డులు రావడానికి కారణం పారిశుధ్యం మెరుగు పడటమే అన్నారు. అంతే కాకుండా కరీంనగర్ నగర ప్రజలకు ప్రతి రోజు మంచి నీరు అందిస్తున్నామని రాబోయే రోజుల్లో 24 గంటల మంచి నీరు అందిస్తున్నట్లు తెలిపారు.

 ఇప్పటికే అద్బుతమైన ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలాప్ చేశామని కరీంనగర్ రూపు రేఖలు రోజు రోజుకు మార్చుతున్నట్లు తెలిపారు. మరో వైపు మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జ్ అదనపు ఆకర్షణగా కరీంనగర్ కు నిలుస్తున్నాయని తెలిపారు. ఈ నగరం యొక్క అభివృద్ధి తో పాటు అహ్లధకరమైన వాతావరణం ఉండటం మా బాధ్యత అని నగర ప్రజల ఆరోగ్యం, భధ్రత మా ధ్యేయం అన్నారు. ప్రజలు ఏది కోరుకుంటే అది చేయడానికి మేము సిద్దంగా ఉన్నామని తెలిపారు. మరో వైపు మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ నగర పారిశుధ్యం లో చాలా వరకు మార్పులు తెచ్చామన్నారు. పరిశుభ్రమైన నగరంగా మార్చేందుకు నగరపాలక సంస్థ ద్వారా యంత్రాలు, వాహానాలు కొనుగోలు చేసి పారిశుధ్యం మెరుగు పరుస్తున్నట్లు తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ సహాకారంతో నగరాన్ని అభివృద్ధి చేస్తూ పరిశుభ్రమైన వాతావరణం ప్రజలకు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు డోర్ టూ డోర్ చెత్తను సేకరించడం తో పాటు పరిసరాలను శుభ్రం చేస్తూ డ్రైనేజీలను కూడ సిల్ట్ తొలగిస్తూ ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.