17వ పోలీస్ బెటాలియన్ లో మెడికల్ క్యాంపు...

17వ పోలీస్ బెటాలియన్ లో మెడికల్ క్యాంపు...

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల :రాజన్న సిరిసిల్ల జిల్లా లోని  17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్ లో కోణార్క్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాన్ని  కమాండెంట్  యస్. శ్రీనివాస రావు ప్రారంభించినారు. న్యూరాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ సింహారెడ్డి   బెటాలియన్ సిబ్బందికి నరాల బలహీనత, వెన్నెముక మరియు మెదడు యెక్క  రుగ్మతల గురించి అవగాహన కల్పించి,తగు సలహాలు సూచనలు చేశారు. 

ఈ సందర్బంగా బెటాలియన్ కమాండెంట్  యస్.శ్రీనివాస రావు   మాట్లాడుతూ "హెల్త్ ఈజ్ వెల్త్ " అని  పోలీస్ సిబ్బంది యొక్క విధులు మిగతా వారితో పోల్చినప్పుడు భిన్నంగా ఉంటాయని, ఎల్లప్పుడూ విధి నిర్వహణలో ఉండటం వల్ల హెల్త్ గురుంచి కేర్ తీసుకునే టైమ్ ఉండదు కానీ ప్రతి ఒకరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుని వ్యాయామం,యోగ లాంటివి చేయాలనీ అన్నారు.సిబ్బంది అందరూ ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకున్నారని తెలియజేశారు. కోణార్క్ హాస్పిటల్  వైద్య బృందానికి కమాండెంట్ యస్. శ్రీనివాస రావు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్  ఎజెపి నారాయణ , యమ్.పార్థసారథి రెడ్డి  అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.