పేదల కోసం కేసీఆర్​ మూడోసారి సీఎం కావాలి: కేటీఆర్​

పేదల కోసం కేసీఆర్​ మూడోసారి సీఎం కావాలి: కేటీఆర్​

బెల్లంపల్లిలో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్​ శంకుస్థాపన చేశారు. కేసీఆర్​ అది చేయలేదు... ఇది చేయలేదని కొందరు అంటున్నారు. 55 ఏళ్ల మీ పాలనలో మీరెందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. మీరు చేయలేని అభివృద్ధిని మేం తొమ్మదేళ్లలో చేసి చూపించామన్నారు. కరెంటు, పెన్షన్లు ఇచ్చింది, పరిశ్రమలు తెచ్చింది నిజం కాదా అన్నారు. బెల్లంపల్లికి ఐటీ కంపెనీ వస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. మాట్లాడితే దేశం కోసం ధర్మం కోసం అని బీజేపీ అంటోంది. మరి ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? బీఆర్ఎస్​ ప్రభుత్వం ఇస్తున్నట్లు ఎకరానికి రూ. 10 వేలు ఇవ్వండి అన్నారు. మోదీ దేవుడని బండి సంజయ్​ మాట్లాడుతారు. మోదీ ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు? అని ప్రశ్నించారు. దమ్ముంటే బెల్లంపల్లిలో మెడికల్​ కాలేజీ ఏర్పాటు చేయండి అన్నారు. పేదల కోసం కేసీఆర్​ తిరిగి మూడోసారి ముఖ్యమంత్రి కావాలన్నారు.