మద్యం అవినీతి పరులకు జైలు తప్పదు

మద్యం అవినీతి పరులకు జైలు తప్పదు
  • మోదీ గ్యారంటీ అంటే వారంటీ
  • చేతులు కలిపిన కట్టర్, కరెప్ట్ పార్టీలు
  • కెసిఆర్ ఇక ఫాం హౌస్ కె
  • మెదక్ జిల్లా తుప్రాన్ సభలో మోదీ

ముద్ర ప్రతినిధి, మెదక్:లిక్కర్ (మద్యం) స్కాం అవినీతి పరులకు జైలు తప్పదని భారత ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఇది మోదీ గ్యారంటీ వారంటీ అన్నారు. రైతులను ముంచడంలో, అవినీతిలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పోటీ పదితున్నాయి, ఢిల్లీ కట్టర్, కరెప్ట్ కెసిఆర్ చేతులు కలిపారన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన కెసిఆర్ ఇక ఫాం హౌస్ కె అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా తుప్రాన్ బ్రాహ్మణపల్లి శివారులో సకల విజయ సంకల్ప సభలో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశంలో ఉగ్రవాదులు దాడులతో అనేకమందిని పొట్టన పెట్టుకున్నారని, ఇదే రోజు బొంబాయి దాడులను గుర్తు చేశారు. 2014లో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉగ్రవాదులు ఏ మూలాన ఉన్నా ఏరివేస్తు శాంతి నెలకొల్పుతున్నామ్మన్నారు. 

రాహుల్ గాంధీ అమేతి నుండి వాయినాడ్ కు వచ్చినట్లు ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన కెసిఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారాన్నారు. కెసిఆర్ పై రైతులు, నిరుపేదలు అగ్రహంగా ఉన్నారన్నారు.  దేవుడి పేరా మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టి భూములు లాక్కుని వదిలేశారు. పాపం చేసే వారికి మల్లికార్జునస్వామి కాదు రైతులు, నిరుపేదలు క్షమించరన్నారు. భగవంతుడి పేరున ప్రజలను ముంచడం బాధాకరమన్నారు. కెసిఆర్ ఇచ్చిన హామీలు మరవడం ఆయన నైజం అన్నారు. దళిత సీఎం, దళిత బందు, డబుల్ బెడ్ రూం, ఉద్యోగాలు ఇవ్వకుండా, రైతులకు సాగు నీరివ్వకుండా మోసం చేశారని కెసిఆర్ పై ద్వాజమెత్తారు. స్కీంల పేరా స్కాం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక ఆయన కుటుంబం కోసం కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. ప్రజలను కలవకుండా ఫాం హౌస్ సీఎం కావాలా ఆలోచించాలన్నారు. పదేళ్లుగా సచివాలయం వెళ్ళని ముఖ్యమంత్రి అవసరమా అంటూ తెలుగులో పేర్కొన్నారు. ఫాం హౌస్ నుండి పాలన చేసిన సీఎంను పర్మనెంట్ గా ఫాం హౌస్ పంపాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారన్నారు.

కాంగ్రెస్, బిఆర్ఎస్ లు అవినీతిమయం, కుటుంబ పాలన, చెడు వ్యవస్థలు వీరి చిరునామా అన్నారు. ఇద్దరూ ఒక్కటే... కకాంగ్రెస్, కెసిఆర్ ఇద్దరితో జాగ్రత్తగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. బిజెపితోనే తెలంగాణ ప్రతిష్ట పెరుగుతుందన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ రోగాల నుండి బిజెపి చికిత్స చేసి రక్షిస్తుందన్నారు. వీరి పాలనలో కొన్ని కుటుంబాలే బాగు పడ్డాయి, నిరుపేదలు, ఎస్సి, ఎస్టీ, బిసిలకు న్యాయం చేయలేదు, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో బిసిని సీఎం చేయలేదు, ప్రతిభావంతులకు అవకాశం రాలేదు...ఈసారి తెలంగాణలో అధికారంలోకి వస్తే మొదటి సారిగా బిసి సీఎం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోది మరోసారి ప్రకటించారు. సామాజిక న్యాయం కేవలం బిజెపితోనే సాధ్యం అవుతుందన్నారు. మాదిగలకు న్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కమిటీ నియామకం చేసింది, సుప్రీంకోర్టులో కేసు ఉంది త్వరలో న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.