సాయి ఆలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ దంపతుల పూజలు 

సాయి ఆలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ దంపతుల పూజలు 


ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల సాయిబాబా మందిరంలో మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్  దంపతులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్  జ్యోతి లక్ష్మణ్  లను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్  వైస్ చైర్మన్ గోలిశ్రీనివాస్, కౌన్సిలర్ చుక్క నవీన్, సాయిబాబా మందిరం చైర్మన్ బల్మూరి సతీష్ కుమార్, నాగుల కిషన్ గౌడ్, వైస్ చైర్మన్ మారాకైలాసం, కోశాధికారి రాంకిషన్ రావు, కంచి కిషన్, కడాలి రామకృష్ణ, తౌటు రామచంద్రం, అడువాల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.