ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను మోసం చేస్తే ఊరుకోం..

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను మోసం చేస్తే ఊరుకోం..

ఎన్పీ ఆర్డీ జిల్లా అధ్యక్షుడు పాముకుంట్ల చందు

ముద్ర ప్రతినిధి, జనగామ: 3వ విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను మోసం చేస్తే ఉరుకోమని ఎన్పీ ఆర్డీ జిల్లా అధ్యక్షుడు పాముకుంట్ల చందు హెచ్చరించారు. సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇచ్చిన మాట ప్రకారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బాలమైన మైసమ్మ, బండవరం శ్రీదేవి, మచ్చ వరలక్ష్మి, నాచు అరుణ, పుట్ట ఉప్పలమ్మ, రాపోలు రజిత, వల్లాల భాగ్య లక్ష్మి, పొన్నాల ఉమా, పి.శారద, ఎర్ర రజిత, బి.ఇందిర, నజియా, బి.శాంత, ఉమా, జి.శ్రీలత, మధు తదితర లబ్ధిదారులు పాల్గొన్నారు.