పార్లమెంట్​లో ప్రవేశపెట్టనున్న నూతన బిల్లులు

పార్లమెంట్​లో ప్రవేశపెట్టనున్న నూతన బిల్లులు


న్యూఢిల్లీ: సోమవారం ప్రారంభమైన పార్లమెంట్​, రాజ్యసభ ఉభయ సభలు మణిపూర్​ అంశంపై చర్చకు పట్టుతో మంగళవారానికి వాయిదా పడ్డాయి. అధికార, విపక్ష సభ్యుల ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో తీవ్ర గందరగోళం మధ్య సభను రద్దు చేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్, స్పీకర్​లు ప్రకటించారు. 

కాగా వర్షాకాల సమావేశంలో మొత్తం 31 బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే 10 బిల్లులు ప్రవేశపెట్టగా, కింద పేర్కొన్న 21 బిల్లులను ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న యూసీసీ బిల్లును ఇంకా ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం ఉందా? లేదా? అనే విషయంలో సమాచారం, స్పష్టత లేదు. 

1. నేషనల్​ క్యాపిటల్​ టెరిటరీ ఆఫ్​ ఢిల్లీ ఆర్డినెన్స్​ బిల్లు: ఢిల్లీలో అధికారుల పోస్టింగ్,​ట్రాన్స్​ఫర్​లకు సంబంధించిన బిల్లు
2. రిజిస్ర్టేషన్​ ఆఫ్​ బర్త్​ అండ్​ డెత్​: దీని కోసం ఆధార్​కార్డులో అప్​డేట్​లను తప్పనిసరి చేయనున్నారు. 
3. అడ్వకేట్​బిల్​: 1879 న్యాయవాదుల కోసం రూపొందిన చట్టాన్ని 36వ అధికరణ ద్వారా 1961 న రూపొందించిన నూతన చట్టసవరణలో విలీనం చేసే బిల్లు
4. డిజిటల్​ పర్సనల్​ డేటా ప్రొటెఓన్​ బిల్లు: దేశ ప్రజల డేటా సురక్షితం ఉంచేందుకు టెక్నాలజీ కంపెనీలను హెచ్చరిస్తూ రూపొందించిన బిల్లు ఇది. ఈ చట్టాన్ని ఆయా సోషల్​ ఫ్లాట్​ఫామ్​ సంస్థలు ఉల్లంఘిస్తూ జరిమానా రూ. 250 కోట్ల వరకూ విధించే అవకాశం ఉంది.
5. పోస్టల్​ సర్వీస్​బిల్లు: 1898లో 125 యేళ్ల క్రితం రూపొందిన ఇండియన్​పోస్ట్​ ఆఫీస్​ యాక్ట్​ను సవరించనున్నారు. ప్రస్తుతం ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేలా ఈ బిల్లును రూపొందించారు.
6. ప్రెస్​, వార్త పత్రికల రిజిస్ర్టేషన్​బిల్​: వార్తా సంస్థలు, వార్త పత్రికలు, మ్యాగజైన్​ల రిజిస్ర్టేషన్ల బిల్లు.
7. సినిమాటోగ్రఫీ బిల్లు: సినిమాల్లో యూ/ఎతోబాటు యూ/ఎ–7+, యూ/ఎ–13+, యూ/ఎ–16+లను పొందుపరిచిన బిల్లు. ఈ బిల్లును విస్మరించి ప్రసారాలను చేస్తే మూడు యేళ్ల జైలు, 10 లక్షల జరిమానా విధించనున్నారు. 
8. నేషనల్​ రీసెర్చ్​ ఫౌండేషన్​ బిల్లు: నేషనల్​ రీసెర్చ్​ ఫౌండేషన్​ను స్థాపించడం. 
9. ఫైనాన్స్​అండ్​ కార్పొరేట్–ఇంటర్నేషనల్​ మోనిటరీ ఫండ్​అండ్​ బ్యాంక్​బిల్లు​: 1945 అంతర్జాతీయ ద్రవ్యనిధి బిల్లును రద్దు చేసి నూతన చట్టాన్ని చేయడం.
10. ప్రొవిజన్​ కలెక్షన్​ ఆఫ్​ ట్యాక్సెస్​బిల్లు: పన్నులకు సంబంధించి రూపొందించిన 1931 చట్టాన్ని రద్దు చేయడం. కొత్త చట్టాన్ని తీసుకురావడం.
11. రైల్వే అండ్​ మైనింగ్​బిల్లు: రైల్వే బోర్డు ద్వారా 1905లో రూపొందించబడిన చట్టాన్ని రద్దు చేయడం. అందులోని కొన్ని అధికరణలను 1989లో చేర్చడం.
12. మైన్స్​ అండ్​ మినరల్​ బిల్లు: మైనింగ్​కు సంబంధించి 1957 చట్టంలో మార్పు చేర్పులు. కొన్ని సంస్థలను మైనింగ్​నుంచి పూర్తిగా తొలగించడం
13. జమ్మూ అండ్​ కశ్మీర్​ రిజర్వేషన్​బిల్లు: నిరుపేదలను ఓబీసీ కేటగిరీల్లో చేర్చడం.
14. జమ్మూకశ్మీర్ లో నివసిస్తున్న పలు ఇతర​సముదాయాల ప్రజలపై బిల్లు: ఈ బిల్లు ప్రకారం అక్కడ నివసిస్తున్న ఇతర సముదాయాలను ఎస్సీ కేటగిరి కింద చేర్చడం
15. నిమ్నవర్గాల బిల్లు: ఛత్తీస్​ఘడ్​లోని మహరా, మహారా జాతులను ఎస్సీ కేటగిరి కింద చేర్చడం.
16. జమ్మూకశ్మీర్​ఇతర సముదాయాలు, నిమ్నవర్గాలపై సర్వే
17. ఎడ్యూకేషన్​, హెల్త్​: విద్య, ఆరోగ్యంపై 1940లో రూపొందించబడిన చట్టాన్ని రద్దు చేయడం. ప్రస్తుతం కొనసాగుతున్న నూతన ఒరవడులను చేరుస్తూ కొత్త బిల్లును రూపొందించడం.
18. నేషనల్​ డెంటల్​ కమిషన్​ బిల్లు: 1948లో రూపొందించిన బిల్లును రద్దు చేయడం.  నూతన నేషనల్​ డెంటల్​ కమిషన్​ను ఏర్పాటు చేయడం
19. నేషనల్​ నర్సింగ్​ అండ్​ మిడ్​వైజరీ కమిషన్​ బిల్​: 1947లో రూపొందించిన బిల్లును రద్దు చేయడం దాని స్థానంలో కొత్త కమిషన్​ను రూపొందించడం.
20. నేషనల్​ కామన్​ఆపరేటివ్​ యూనివర్సిటీ బిల్లు: దేశమంతటా నేషనల్​ కామన్​ ఆపరేటివ్​యూనివర్సిటీలను ఏర్పాటు చేయడం.
21. ఎఎంఎఎస్​ఆర్​(ఎన్సియేంట్​ మాన్యూమెంట్స్​ అండ్​ ఆర్కియాలజికల్​సైట్స్​ అండ్​ రీమేన్​): 1958 రూపొందిన చట్టంలో మార్పులు చేయడం.