పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి బికెయంయు రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్

పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి బికెయంయు రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులుగా పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని బికెయంయు రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు దాటినా నేటికీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీవితాల్లో కానీ జీతాల్లో కానీ కనీస మార్పు కూడా లేకుండా పోయిందని , కార్మిక వర్గ హక్కులు హరించుకుపోతున్నాయని ఆయన ఆరోపించారు.

నెలల తరబడి అప్పులు చేసి కిరాణా సామాన్లు , కూరగాయలు , కోడిగుడ్లు తదితర వస్తువుల కోసం మెడలో ఉన్న తాళిబొట్లు సైతం కుదువబెట్టి వంటలు చేసి విద్యార్థులకు వండిపెట్టి బిల్లుల కోసం , చేసిన కష్టం కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన దుస్తితి దాపురించిందని , ప్రభుత్వం సైతం 10 12 నెలలకు ఒకసారి విడుదల చేసే బిల్లులు కూడా వడ్డీలకు సరిపోవడం లేదని సృజన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. 2015 వ సంవత్సరంలో పెంచిన మెనూ మెస్ చార్జీలను 8 సంవత్సరాల గడిచినా కానీ ఒక్క పైసా పెంచలేదని , ధరలు విపరీతంగా పెరిగి కార్మికులకు అప్పుల ఙభారం పెరిగిపోతున్నదని ఆయన ఆరోపించారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెస్ మెనూ చార్జీలను పెంచాలని , ప్రతి నెల కార్మికుల వంట బిల్లులను చెల్లించడం ,తోపాటు గ్యాస్ సిలిండర్లను , వంట పాత్రలను , కోడిగుడ్డులను ప్రభుత్వమే సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ హక్కులైన పిఎఫ్ , ఈఎస్ఐ , గ్రాట్యుటీ , పెన్షన్ తోపాటు ఏకరూప దుస్తులు యూనిఫామ్ సౌకర్యం , హెల్త్ కార్డులు , గుర్తింపు కార్డులు , ప్రమాద బీమా 10 లక్షల మరణ సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో ప్రకారం 137 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను వెంటనే కార్మికుల అకౌంట్లల్లో జమ చేయాలని , లేనియెడల ఏఐటీయూసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మధ్యాహ్న భోజన కార్మికుల పోరాటం మరింత ఉధృతం చేస్తామని సృజన్ కుమార్ హెచ్చరించారు.