సిరిసిల్లలో గంజాయి అమ్ముతున్న వ్యక్తుల అరెస్ట్ - ఎక్సైజ్ సి.ఐ ముస్తాఫా

సిరిసిల్లలో గంజాయి అమ్ముతున్న వ్యక్తుల అరెస్ట్ - ఎక్సైజ్ సి.ఐ ముస్తాఫా

సిరిసిల్ల టౌన్, ముద్ర: జిల్లా ఎక్సైజ్ అధికారి సామల పంచాక్షరీ, కరీంనగర్ ఎక్సైజ్ ఉప కమీషనర్ విజయ భాస్కర్ రెడ్డి ల విశ్వసనీయమైన సమాచారం మేరకు సిరిసిల్ల ఎక్సైజ్ టాస్క్ఫోర్స్, సిరిసిల్ల ఎక్సైజ్ సిబ్బంది కలిసి సిరిసిల్ల సివిల్ హాస్పిటల్ ముందు ఎం.డి.నయీమ్ (మార్కండేయ వీధి, సిరిసిల్ల) నాందేడ్ నుంచి గంజాయి తెచ్చి చింతకుంట సంతోష్ (గాంధీ చౌక్, సిరిసిల్ల) అను వ్యక్తికి విక్రయిస్తుండగా వారిద్దరిని పట్టుకొని సోదాచేయగా 36 గ్రాముల గంజాయి దొరికిందని ఎక్సైజ్ సి.ఐ. గులామ్ ముస్తాఫా తెలిపారు. వీరిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి కరీంనగర్ జైలు కు తరలించడమైనదని ముస్తాఫా తెలిపారు. గంజాయి రవాణా చేయడం, కలిగి ఉండడం, సేవించడం మత్తు పదార్థాల నిరోధక చట్టం ప్రకారం నేరం అని తెలిపారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ శైలజ, సిరిసిల్ల ఎక్సైజ్ ఎస్ఐ లు ముకుంద శేఖర్, రాజెందర్ పాల్గొన్నారు. గంజాయి పట్టుకున్న సిబ్బంది ఎ.శ్రీనివాస్, జి.శ్రీనివాస్, నరెందర్, మధుకర్, రాకేష్, సుమన్, శంకర్ లను అధికారులు అభినందించారు.