ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోని ప్రైవేట్ పాఠశాలలు..

ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోని ప్రైవేట్ పాఠశాలలు..

గొల్లపల్లి, ముద్ర:- విచ్చలవిడిగా అధిక ఫీజులను  వసూలు చేస్తూ నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు.  ప్రైవేట్ పాఠశాలలలో  ప్రవేశపెట్టిన విద్యా హక్కు చట్టం 1982 ద్వారా   ప్రైవేటు స్కూళ్లలో 25% శాతం పేద విద్యార్థులకు విద్య అందించాలి. గతంలో ప్రైవేట్ రంగంలో విద్యా సంస్థలు నడిచేవి వాటి  సేవను గుర్తించిన ప్రభుత్వాలు " గ్రాడ్ ఇన్ ఎయిడ్ " ను ఇచ్చేవి . లాభపెక్ష  లేని విధానమది. కాలం మారింది విధానాలు మారాయి విద్య అంగడి వస్తువుగా మారింది.పిల్లలు రేపటి పెట్టుబడి సరుకుల్లా భావించబడుతున్నారు. ఇదో అనారోగ్యకర వాతావరణం. ఇలా విద్యారంగం ప్రైవేటీకరణ చెందడంతో 1994 జనవరి 1న ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 1 ని ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం విద్యాసంస్థలు  నడుచుకోవాలని నిర్దేశించబడింది.ఈ నిబంధనల ప్రకారం ప్రతిప్రవేట్  పాఠశాలలో తల్లిదండ్రులచే ఒక గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయాలి. శిక్షణ పొందిన ఉపాధ్యాయులనే నియామకం చేయాలి.

ఈ విషయాలను తమ పాఠశాలల నోటీస్ బోర్డుల పైన ప్రదర్శించాలి. అయితే విద్య రంగం గాడి తప్పింది. దీనిని ఏ పాఠశాల కూడా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. కాబట్టి పౌర సమాజమే వీటిని పట్టించుకోని విద్యారంగాన్ని తిరిగి గాడిలో పెట్టాలి.ప్రైవేట్ విద్యాలయాల స్థాపనకు ప్రస్తుతం ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 01 తేదీ 01-01-1994 ప్రధానమైనది కాగా ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలు ప్రారంభించడానికి మార్గదర్శకమైనది 1988లో జారీ చేయబడ్డ ప్రభుత్వ ఉత్తర్వు 524. విచిత్రం ఏమిటంటే ప్రభుత్వమే 524 ఉత్తర్వులో పొందుపరిచిన చాలా  విషయాలను ప్రభుత్వ ఉత్తర్వు   01  ద్వారా మార్చి  ప్రైవేట్ విద్యాలయాలకు విద్య రంగాన్ని  కొంగు బంగారంలా చేసింది. కాగితాల మీద నియమ నిబంధనలు పద్ధతులు విధివిధానాలు చాలా విషయాలు ఈ రెండు ప్రభుత్వ ఉత్తర్వులలో కనపడతాయి.కానీ వాస్తవానికి ఈ ఉత్తర్వు ( 01 ) ని తుచ తప్పకుండ పాటిస్తే ఇప్పుడున్న ప్రైవేట్ పాఠశాలల్లో 90% స్కూళ్లకు మంగళం పాడాల్సిందే.అంటే ఒక ప్రైవేట్ పాఠశాల ప్రారంభించడానికి గుర్తింపు పొందడానికి అన్ని కోణాల నుండి నియమ నిబంధనలను పొందుపరిచినప్పటికీ అవేవీ చాలా విద్య సంస్థలో లేకపోవడం మనం చూస్తూన్నదే. ఫీజులు కూడా ప్రభుత్వ నిబంధనలకు లోబడే వసూలు చేయబడాలి.  

పాఠశాలల్లో అందరికీ త్రాగునీటి వసతి కల్పించాలి.అదే కల్పిస్తే బాలక్రీస్తుల్లా బ్యాగులు మోసే  లక్షలాదిమంది బాలబాలితలకల భుజాలకు వాటర్ బాటిల్స్ ఎందుకుంటాయి. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వేరువేరు టాయిలెట్స్ వుండాలి.ప్రత్యేక గదితో బాటు వివిధ భాషలకు చెందిన పుస్తకాలు ఉండాలి.చాలా స్కూళ్లకు ఆటస్థలం లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు.  శారీరక ఫిట్నెస్ కోల్పోతున్నారు ఆట అనేది మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది.అలాంటి వాటికి దూరం చేస్తున్నారు.ఇప్పటికైనా ఈ ప్రైవేటు స్కూళ్లు చేస్తున్న దోపిడిని ప్రభుత్వం ఇప్పటికైనా అరికట్టాలి మండలాలలో ఉన్న ఎం.ఈ.ఓ.లు చూసిచూడనట్టు ఉంటున్నారు.జిల్లా యంత్రానికి అయితే అసలు పట్టనట్టే ఉంటున్నారు.దీనిపైన ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి నియమ నిబంధనలను పాటించిని ప్రైవేట్ స్కూళ్ల  పర్మిషన్లు వెంటనే రద్దు చేయాలని మేధావులు కోరుతున్నారు.